Monday, December 23, 2024

కూలీ ఇప్పిస్తానని చెప్పి మహిళపై అత్యాచారం… రాయితో తలపై మోది

- Advertisement -
- Advertisement -

Rape on Labor women in Rangareddy

 

హైదరాబాద్: కూలీ ఇప్పిస్తానని చెప్పి తీసుకెళ్లి మహిళపై అత్యాచారం చేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మదనపల్లి కొత్త తండాకు చెందిన మహిళ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది. బుధవారం ఉదయం శంషాబాద్‌లో అడ్డా మీద కూలీ కోసం మహిళ వేచిచూస్తుంది. ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి కూలీ పని ఉందంటూ ఆమెను తీసుకెళ్లారు. కవ్వగూడ వ్యవసాయ పొలాల్లోని నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశారు. అనంతరం బండరాయితో తలపై మోది అక్కడ నుంచి పారిపోయారు. స్థానిక రైతులు గమనించి కొన ఊపిరితో ఉన్న ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎనిమిది సంవత్సరాల క్రితం భర్త చనిపోవడంతో ఇద్దరు కుమార్తెలను, కమారుడ్ని పోషిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News