Sunday, December 22, 2024

గంజాయి మత్తులో అఘాయిత్యం

- Advertisement -
- Advertisement -

13 ఏళ్ల విద్యార్థినిపై ఆకతాయిలు గంజాయి మత్తులో అత్యాచారం చేశారు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా పరిగి నియోకవర్గం, దోమ మండల పరిధిలోని గుండాల్ గ్రామంలో చోటుచేసుకుంది. బాలిక కుటుంబ స భ్యులు, పోలీసుల వివరాల ప్రకారం.. గుం డాల్ పంచాయతీకి చెందిన ఓ 13ఏళ్ల బాలిక స్థానిక పాఠశాలలో 8వ తరగతి చదువుతోం ది. ఇదే గ్రామానికి చెందిన యువకులు శ్రీనివాస్, సంతు, మైనర్ బాలలు సూరి, పవన్, చంద్రు కలిసి గంజాయి మత్తులో సామూహిక అత్యాచారం చేశారు. విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడం తో వారు శుక్రవారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎస్‌ఐ, పోలీసులు వెంటనే నిందితులు ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. కాగా, వైద్య పరీక్షల నిమిత్తం బాధితురాలిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News