Thursday, January 23, 2025

సోషల్ మీడియాలో పరిచయం…. అక్కా చెల్లెళ్లపై అత్యాచారం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఫేస్‌బుక్‌లో పరిచయం చేసుకొని అక్కాచెల్లెళ్లపై ఇద్దరు యువకులు అత్యాచారం చేసిన సంఘటన హైదరాబాద్‌లోని సికింద్రాబాద్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అంబర్‌పేటకు చెందిన నవాజ్ (21), ఇంతియాజ్ (21) అనే యువకుడు సోషల్ మీడియాలో అక్కాచెల్లెళ్లు పరిచయమయ్యారు. ఫేస్‌బుక్‌లో పరిచయం కావడంతో ప్రేమ పేరుతో వారిని ఇద్దరు లోబర్చుకున్నారు. రెండు సంవత్సరాల నుంచి వారిపై అత్యాచారం చేస్తుండడంతో అక్కాచెల్లెళ్లు తన తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పారు. వెంటనే వారు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News