Thursday, January 23, 2025

టాలీవుడ్ నటిపై అత్యాచారం…

- Advertisement -
- Advertisement -

Rape on tollywood actor

 

ముంబయి: పెళ్లి చేసుకుంటానని నమ్మించి టాలీవుడ్ హీరోయిన్‌పై పలుమార్లు జిమ్ ట్రైనర్ అత్యాచారం చేసిన సంఘటన ముంబయిలోని కుఫ్ పారేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2021లో అదిత్య కపూర్ అనే జిమ్ ట్రైనర్, నటిని కలిశాడు. ఇద్దరు సెల్‌ఫోన్ నంబర్స్ తీసుకొని అప్పుడప్పుడు కలుసుకునేవారు. లాక్‌డౌన్ విధించడంతో అదిత్య ఇంటిలో ఇద్దరు కలుసుకునేవారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెపై పలుమార్లు లైంగికంగా దాడికి పాల్పడ్డాడు. పెళ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి తీసుకరావడంతో చంపేస్తానని బెదిరించడంతో పాటు ఇద్దరు చనువుగా ఉన్నప్పటి ఫోటోలు తన దగ్గర ఉన్నాయని సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించాడు. దీంతో వెంటనే ఆమె తల్లిదండ్రులను తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి జిమ్ ట్రైనర్‌ను అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News