Sunday, November 17, 2024

రైతుల ధర్నాలో పాల్గొన్న యువతిపై నలుగురు అత్యాచారం….

- Advertisement -
- Advertisement -

Rape on women in farmers strike

ఢిల్లీ: రైతుల ధర్నాలో పాల్గొన్న యువతిపై నలుగురు అత్యాచారం చేయడంతో పాటు ఆమెకు కరోనా సోకింది. దీంతో ఆమె పరిస్థితి విషమించి చనిపోయిన సంఘటన ఢిల్లీలో జరిగింది. పశ్చిమ బెంగాల్  కు చెందిన యువతి కిషాన్ సోషల్ ఆర్మీ అనే బృందాన్ని తయారు చేసి ఢిల్లీలో ని టిక్రి సరిహద్దులో రైతులతో ఆమె ధర్నా చేస్తోంది. ఆమెతో పరిచయమైన నలుగురు యువకులు యువతిపై అత్యాచారం చేశారు. ఇంతలోనే ఆమె కరోనా సోకడంతో స్థానిక ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుంది. తనపై అత్యాచారం జరిగిందని తన తండ్రికి ఫోన్ లో తెలిపింది. ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా కన్నుమూసింది. వెంటనే ఆమె తండ్రి స్థానిక పోలీస్ స్టేషన్ తన కూతురుపై అత్యాచారం జరిగిందని ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసునమోదు చేసి నలుగురు నిందితుల్లో అనూప్, అనిల్ మాలిక్ ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News