Sunday, January 19, 2025

టెక్ జాబ్ ఇంటర్వ్యూ పేరుతో 27 ఏళ్ల మహిళపై అత్యాచారం

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ: ఉద్యోగం ఇంటర్వ్యూ పేరుతో ఒక 27 ఏళ్ల టెకీ మహిళకు మత్తు మందు ఇచ్చి ఆమెపై ఒక వ్యక్తి అత్యాచారం జరిపిన దారుణ ఘటన ఢిల్లీ శివార్లలోని గురుగ్రామ్‌లో గత శనివారం చోటుచేసుకుంది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన ఆ మహిళను ఇంటర్వ్యూ పేరు చెప్పి గురుగ్రామ్‌లోని సహారా మాల్ వద్దకు పిలిచిన ఆ వ్యక్తి ఆమెను పార్కింగ్ లాట్‌లోకి తీసుకెళ్లి, మత్తు కలిపిన నీళ్లు తాగించి తన కారులోనే ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం ఆన్‌లైన్ జాబ్ కోసం ఆమె ప్రయత్నిస్తోంది. తుషార్ శర్మ అనే వ్యక్తిని ఆమె సంప్రదించగా సహారా మాల్ వద్దకు ఆమెను శనివారం రమ్మన్నాడు.

మద్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఆమె అక్కడకు తన సర్టిఫికెట్లతో చేరుకుంది. అక్కడ శర్మను ఆమె కలుసుకుంది. ఆమెను తన కారులో కూర్చోపెట్టుకుని అతను బేస్‌మెంట్‌లోని పార్కింగ్ లాట్‌కు తీసుకెళ్లాడు. అక్కడ ఆమె మత్తు కలిపిన నీళ్లు తాగి స్పృహకోల్పోయింది. ఆమెపై అత్యాచారానికి పాల్పడిన శర్మ ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ ఆమెను బెదిరించాడు. ఆమెను అక్కడే వదిలేసి అతను కారులో పరారయ్యాడు. నేరుగా ఆమెపై పోలీసు స్టేషన్ చేరుకుని ఫిర్యాదు చేయగా ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపతికి తరలించారు. అనంతరం నిందితుడిపై కేసు నమోదు చేసి అతడి కోసం గాలిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News