Thursday, January 23, 2025

మహిళకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం….

- Advertisement -
- Advertisement -

Rape on women with Narcotics

 

రంగారెడ్డి:  ఓ మహిళకు ప్రభుత్వ ఉద్యోగి మత్తు మందు ఇచ్చి అనంతరం ఆమెపై అతడు అత్యాచారం చేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో జరిగింది. వీడియోను రికార్డు చేసి ఆమె ఫోన్‌కు పంపించడంతో పాటు బెదిరించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ముఢావత్ చందులాల్ (40) అనే వ్యక్తి శంషాబాద్ ఉప కేంద్రంలో ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. శంషాబాద్‌లో ఓ మహిళకు భర్త చనిపోవడంతో తాను కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. చందులాల్ ఆమెను పలుమార్లు లైంగికంగా వేధించాడు. కోరిక తీర్చాలని ఆమె వెంటపడడంతో నిరాకరించింది. ఆమె ఇంటికి వెళ్లి డోర్ కొట్టాడు. ఆమె డోర్ ఓపెన్ చేయగా ముక్కుపై మత్తు మందు పెట్టాడు. ఆమె స్పృహ కోల్పోయిన తరువాత ఆమెపై అతడు అత్యాచారం చేయడంతో వీడియో రికార్డు చేశాడు. మహిళ నగ్న దృశ్యాలను ఆమె ఫోన్ లోకి పంపించి బెదిరించాడు. వెంటనే ఆమె స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News