Monday, December 23, 2024

బర్త్ డే పార్టీకి పిలిచి యువతిపై గ్యాంగ్ రేప్

- Advertisement -
- Advertisement -

Rape on Young Girl in Uttar pradesh

లక్నో: పుట్టిన రోజు వేడుకలకు పిలిచి యువతిపై సామూహిక అత్యాచారం చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మోదీనగర్ పట్టణంలో ఓ యువతి ప్రైవేటు కంపెనీలో పని చేస్తుంది. ఆదివారం స్నేహితుడు బర్త్ డే పార్టీకి పిలవడంతో వెళ్లింది. మత్తు మందు కలిపిన డ్రింక్‌ను ఆమెకు స్నేహితుడు ఇచ్చాడు. ఆమె మత్తులోకి జారుకున్న తరువాత ఇద్దరు స్నేహితులను రూమ్‌కు పిలిచి ఆమెపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. మత్తు నుంచి తేరుకున్న తరువాత ఆమె ప్రతిఘటించింది. ఎవరికైనా చెబితే చంపేస్తామని నిందితులు బెదిరించారు. దీంతో వెళ్లి తన తండ్రికి చెప్పడంతో వెంటనే అతడు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను ఆరోగ్య పరీక్షల నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. రేప్ జరిగినట్టు నిర్ధారణ కావడంతో వెంటనే ముగ్గురు నిందితులు అర్జున్, శేఖర్, కృష్ణను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని ఎఎస్‌పి ఇరాజ్ రాజా తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News