Monday, December 23, 2024

కదులుతున్న కారులో యువతిపై అత్యాచారం…

- Advertisement -
- Advertisement -

లక్నో: లిఫ్ట్ ఇచ్చి కదులుతున్న కారు యువతిపై అత్యాచారం చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం జైసింగ్‌పూర్ ప్రాంతం సుల్తానాపూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ యువతి(23) ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతోంది. కాలేజీ నుంచి ఇంటికి వెళ్లేందుకు నిలబడింది. బస్సుల కోసం చాలా సేపు నుంచి ఎదురుచూస్తోంది. కారు వస్తుండడంతో లిఫ్ట్ అడిగింది. ఆమెను కారులో ఎక్కించుకున్న తరువాత డ్రైవర్ సీట్లో ఉన్న వెనక కూర్చోగా మరో వ్యక్తి డ్రైవింగ్ చేస్తున్నాడు. కారు కదులుతుందగా ఆమెపై అతడు అత్యాచారం చేశాడు. అనంతరం ఆమెను కాలువ వద్ద పడేసి అక్కడి నుంచి ఇద్దరు పారిపోయారు. వాహనదారులు గమనించి ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాధితురాలు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిపంప చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News