Thursday, January 23, 2025

తెలంగాణ రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి : అసదుద్దీన్

- Advertisement -
- Advertisement -

కశ్మీర్‌లో ఉగ్రతుటాలను ఆపలేకపోతున్న బిజెపి

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత తొమ్మిదేళ్ళ కాలంలో రాష్ట్రంలో అభివృద్ధి శరవేగంగా సాగుతోందని ఎంఐఎం అధినేత, ఎంపి అసదుద్దీన్ ఓవైసి అన్నారు. తొమ్మిదేళ్ళలో మత ఘర్శణలకు తావులేని పాలన సాగుతోందన్నారు. శనివారం పార్టీ కార్యాలయం దారుస్సలాంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలోనే అత్యధిక జిడిపి తెలంగాణ లో ఉందన్నారు. హైద్రాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యుసి సమావేశాలు జరగడంపై ఆయన స్పందిస్తూ ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీ అయినా, సమావేశాలు పెట్టుకోవచ్చని అన్నారు. మఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారని ఓవైసి ప్రశంసించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ముస్లిం విద్యార్థులకు ఆరు నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య అందిస్తున్నారా? అని అసదుద్దీన్ ప్రశ్నించారు.

కశ్మీర్ లోని అనంతనాగ్ లో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో ముగ్గురు సైనికాధికారులు వీరమరణం పొందడం తెలిసిందే. ఈ విషయమై ఓవైసి మాట్లాడుతూ గత నాలుగు రోజులుగా అక్కడ కాల్పులు జరుగుతూనే ఉన్నాయని, టెర్రరిస్టులు సెర్చ్ ఆపరేషన్ కు వచ్చిన భారత సైనిక బలగాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరుపుతున్నారని అయినా బుల్లెట్ లను ఆపడంలో మోడీ ప్రభుత్వం విఫలమయ్యిందని విమర్శించారు. ఈ కాల్పుల్లో ముగ్గురు సైనికాధికారులను కోల్పోవడం ద్వారా భారత్ కు భారీ నష్టం జరిగిన నేపథ్యంలో అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా స్పందించారు.

ఈ బుల్లెట్‌ల ఆటను ఆపేలా కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో వచ్చే నెలలో భారత్- పాక్ జట్లు ప్రపంచ కప్ మ్యాచ్ లో తలపడనుండగా, ఆ మ్యాచ్ కంటే ముందే రాజౌరీలో కశ్మీరీ పండిట్లతో, భారత సైనికులతో టెర్రరిస్టులు ఆడుతున్న బుల్లెట్ల మ్యాచ్ కు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందని ఓవైసీ స్పష్టం చేశారు. దీపిపై కేంద్రం మౌనంగా ఉండడం దేనికి సంకేతమని ఆయన నిలదీశారు. కశ్మీర్ పట్ల కేంద్రం అనుసరిస్తున్న విధానం విఫలం కావడం వల్లే టెర్రరిస్టులు బుల్లెట్‌ల ఆటకు తెరదీశారని ఒవైసీ విమర్శించారు. అనంతనాగ్ జిల్లాలో భారత సైనికుల జీవితాలు ముగిసిపోతున్నాయని, మోడి స్టేడియంలో భారత్-పాక్ మ్యాచ్ నిర్వహిస్తారా? అని ప్రశ్నించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News