Thursday, January 23, 2025

రాష్ట్ర ప్రభుత్వం చొరవతో శరవేగంగా మున్సిపాలిటీల అభివృద్ధి

- Advertisement -
- Advertisement -

మరిపెడ : తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక చొరవతో మున్సిపాలిటీలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, పాలన సౌలభ్యం కోసం సిఎం కెసిఆర్ ఏర్పాటు చేసిన నూతన మున్సిపాలిటీలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ అన్నారు. ఆదివారం ఆయన మరిపెడ మున్సిపాలిటీలోని 3, 4, 6, 7, 12, 13, 14, 2, 10, 11వ వార్డుల్లో విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులకు జిల్లా గ్రంథాలయ సంస్ధ చైర్మన్ గుడిపుడి నవీన్‌రావుతో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ముందుగా ఆయా వార్డుల్లో ప్రజాప్రతినిధులు, బిఆర్‌ఎస్ శ్రేణులు ఎమ్మెల్యే రెడ్యానాయక్‌కు బతుకమ్మలు, బోనాలు, కోలాటాలు, నృత్యాలు, డ్యాన్స్‌లతో పూలు చల్లుకుంటూ ఘన స్వాగతం పలికి గజమాలలతో ఘనంగా సన్మానించారు.

అనంతరం మున్సిపల్ చైర్‌పర్సన్ గుగులోతు సింధూర రవినాయక్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిఎం కెసిఆర్ ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీలు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయన్నారు. నేడు యావత్ దేశం తెలంగాణ వైపు చూస్తొందని, ఇంత తక్కువ సమయంలో ప్రపంచ స్థాయి దిగ్గజాలను సైతం అబ్బురపరిచే విధంగా ఎలా అభివృద్ధి చెందందని ఆశ్చర్యపోతున్నారని తెలిపారు. సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ నేతృత్వంలో మున్సిపాలిటీల అవసరాలకు అనుగుణంగా రోడ్లు, చెరువులు, సాగునీరు, విద్యాలయాలు, ఆస్పత్రులు, వైకుంఠధామాలు, ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, ట్రాక్టర్లు, ఇంటింటికి తాగునీరు ఇలా ఎంతో ప్రగతి అందించానని గుర్తు చేశారు.

మరిపెడ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం బిఆర్‌ఎస్ ప్రభుత్వం గత నాలుగేళ్ల క్రితం రూ. 20 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇట్టి నిధులతో మరిపెడలో వైకుంఠధామం, మీని ట్యాంకు బండ్, పార్క్, సిసి డ్రైన్స్, ఆడిటోరియం తదితర అభివృద్ధి పనులు చేట్టామన్నారు. ఇటీవల సిఎం కెసిఆర్ జిల్లా పర్యటన సందర్భంగా మరో రూ. 25 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. పట్టణంలోని సేవానగర్, ఇందిర కాలనీ, మందుల వాడ, గ్యామాతండా, రామావిలాస్ గల్లీ తదితర ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఉందని, సమస్యను పరిష్కరించేందుకు రూ.2 కోట్లతో రెండు ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మిస్తున్నామన్నారు.

పట్టణంలో పలు వార్డుల్లో ఇళ్లపై నుంచి వెళ్లే విద్యుత్ లైన్లు, విద్యుత్ స్తంభాల పునరుద్ధరణకు రూ. 2 కోట్లు, ప్రతి వానాకాలంలో కార్గిల్ సెంటర్ వద్ద వర్షపు నీరు నిలిచి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారని, ఆ సమస్యను పరిష్కరించేందుకు సుమారు రూ. కోటి 30 లక్షలతో డైనేజీ నిర్మిస్తున్నట్లు, రూ. 2 కోట్లతో రజకులకు దోబీ ఘాట్, రూ. కోటి 50 లక్షలతో అధునాతనమైన వైకుంఠధామం, స్ధానిక దారం రామయ్య ఇంటి నుంచి మాకుల గుడి వరకు రోడ్డు విస్తరణ చేసి బిటి రోడ్డు రూ. 50 లక్షలు, మాకుల దేవస్ధానాన్ని పర్యాటక కేంద్రంగా మార్చేందుకు సమీపంలో పెద్ద చెరువును మీని ట్యాంకు బండ్‌గా మార్చడానికి రూ, 2 కోట్ల 50 లక్షలు, ఆడిటోరియంలో ఏసి అమర్చడానికి రూ. 30 లక్షలు, మున్సిపల్ భవన నిర్మాణానికి రూ. 3 కోట్లు, అదే విధంగా రూ.10 కోట్లతో 15 వార్డుల్లో సిసి డ్రైన్స్ నిర్మాణం తదితర అభివృద్ధి పనులను చేపట్టడం జరుగుతుందన్నారు. అర్హులైన వారికి గృహలక్ష్మి, దళిత బంధు పథకాలను వర్తింప చేస్తామన్నారు. మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న బిఆర్‌ఎస్‌కు మారో మారు పట్టం కట్టాలని, డోర్నకల్ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించి మరో మారు అసెంబ్లీకి పంపాలని కోరారు. అందరి భాగస్వామ్యంతోనే మున్సిపాలిటీ అభివృద్ధి జరుగుతుందని, మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తోడ్పాటును అందించాలన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గుగులోతు సింధూర రవినాయక్, వైస్ చైర్మన్ ముదిరెడ్డి బుచ్చిరెడ్డి, ఎంపిపి గుగులోతు అరుణ రాంబాబునాయక్, జడ్‌పిటిసి తేజావత్ శారధా రవీందర్‌నాయక్, పిఏసిఎస్ చైర్మన్ చాపల యాదగిరిరెడ్డి, ఓడిసిఎంఎస్ మాజీ చైర్మన్ కుడితి మహేందర్‌రెడ్డి, మాజీ ఎంపిపి గుగులోతు వెంకన్న, మండల పార్టీ అధ్యక్షులు సత్యనారాయణరెడ్డి, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు తాళ్లపెల్లి శ్రీనివాస్, మాజీ జడ్‌పిటిసి బాల్ని మాణిక్యం, ఎంపిటిసిల ఫోరం అధ్యక్షుడు తాళ్లపెల్లి రఘు, పట్టణ అధ్యక్షులు ఉప్పల నాగేశ్వర్‌రావు, బిఆర్‌ఎస్ జిల్లా నాయకులు గుగులోతు రాంబాబునాయక్, తేజావత్ రవీందర్‌నాయక్, అయూబ్‌పాషా, ఉప్పల జాషువా వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు రేఖ లలిత వెంకటేశ్వర్లు, మాచర్ల స్రవంతి భద్రయ్య, బోడ పద్మ కోటేష్, వూరుకొండ శ్రీనివాస్, బయ్య భిక్షం, బాదావత్ హతిరాం, ఏడెల్లి పరశురాములు, బానోతు శ్రీను, కోఆప్షన్ సభ్యులు మక్సూద్, ఖైరున్ హుస్సేన్, బిఆర్‌ఎస్ మండల ఉపాధ్యక్షులు నారెడ్డి సుదర్శన్‌రెడ్డి, ఎస్‌టిసెల్ పట్టణ అధ్యక్షులు జాటోతు బాలాజీ, ఎస్‌టిసెల్ మండల అధ్యక్షులు అజ్మీర రెడ్డినాయక్, మైనార్టీ మండల అధ్యక్షులు హబీబోద్ధీన్, బిఆర్‌ఎస్ నాయకులు పానుగోతు వెంకన్న బోడ రామదాసు, బోడ దామోదర్, గంట్ల మహిపాల్‌రెడ్డి, గంధసిరి కృష్ణ, దిగజర్ల ముఖేష్, ఏడెల్లి రవి, సైదులు, మీరాహుస్సేన్, మాసబత్తిని సతీష్, జిఎన్ రెడ్డి, బాలాజీ, జాటోతు గణేష్, కమిషనర్ ఏ. రాజు, తహశీల్ధార్ పిల్లి రాంప్రసాద్, మిషన్ భగీరథ ఏఈ రాకేష్, విద్యుత్ ఏఈ పావని, నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News