చేవెళ్ల: చేవెళ్లలో అభివృద్ధి శరవేగంగా ముందుకు సాగుతుందని కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గం సీనియర్ నాయకులు సున్నపు వసంతం పేర్కొన్నారు. చేవెళ్ల బ్రదర్స్‌గా ముద్రపడిన చేవెళ్ల సర్పంచ్ శైలజా ఆగిరెడ్డి, చేవెళ్ల పిఎసిఎస్ చైర్మన్ దేవర వెంకట్‌రెడ్డి గ్రామ అభివృద్ధికి కంకణ బద్ధులుగా పనిచేస్తున్నారని కొనియాడారు.
గ్రామంలోని అంగడిబజార్ కాలనీ వాసులు సిసి రోడ్డు కావాలని అడగగానే రోడ్డు పనులను చేపట్టేందుకు వారు తీసుకున్న నిర్ణయం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. సిసి రోడ్డు నిర్మాణానికి సంబంధించి పనులను ఆయన బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలనీ వాసులు అడగగానే అంగడిబజార్‌లోని పోచమ్మగుడి ఆవరణ, అంబేడ్కర్‌నగర్ కాలనీలో సిసి రోడ్డు పనులకు తమ స్వంత నిధులు కేటాయించి దూరదృష్టితో చేవెళ్ల అభివృద్ధి చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. పిలిస్తే పలికే నాయకులుగా చేవెళ్ల కాంగ్రెస్ నాయకులు ఉండడం గర్వించదగ్గ విషయమని తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు చేవెళ్ల బ్రదర్స్‌గా వారికి పేరు రావడం ఆనందంగా ఉందన్నారు. చేవెళ్ల అభివృద్ధిలో మరింత భాగస్వాములు కావాలని అందరికి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపిటిసి సభ్యులు గుండాల రాములు, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు ఆలంపల్లి వీరేందర్‌రెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శులు గడ్డమీది పెంటయ్యగౌడ్, యాలాల మహేశ్వర్‌రెడ్డి, చేవెళ్ల ఉప సర్పంచ్ గంగి యాదయ్య, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్, వార్డు సభ్యులు శ్రీనివాస్‌రెడ్డి, బి. శ్రీనివాస్, జంగనోళ్ల అశోక్, సోషల్ మీడియా కన్వీనర్ కె. మాణిక్యం, కాలనీవాసులు తలారి ప్రకాష్, బురాన్ సత్తయ్య, సున్నపు నర్సింలు, బేగరి భాస్కర్, చంద్రయ్య, మద్దెల రాంచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.