Monday, December 23, 2024

సాంకేతిక రంగంలో శరవేగంగా ప్రగతి

- Advertisement -
- Advertisement -

ఐరాస జియో స్పేషియల్ అంతర్జాతీయ సదస్సులో ప్రధాని మోడీ

హైదరాబాద్‌లో సదస్సు జరపడం
అద్భుతమని వ్యాఖ్య

మనతెలంగాణ/హైదరాబాద్: శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశం వేగంగా దూసుకుపోతోందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న రెండో ప్రపంచ జియో స్పేషియ ల్ అంతర్జాతీయ సదస్సులో ప్రధాని వర్చువల్ గా పాల్గొని ప్రసంగించారు. సమగ్రాభివృద్ధి, ప ర్యావరణ , వాతావరణ మా ర్పులు సవాళ్లపై జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడు తూ పర్యాటకం , అతిథ్యం, సాంస్కృతి సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇచ్చే హైదరాబాద్‌లో సదస్సులు జరగడం గొప్ప విషయం అన్నారు. జియోస్పేషియల్‌తో గ్రామీణ ప్రాంతాలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.మనమంతా జియోస్పేషియల్‌లో చేరామని , ఈ సెక్టారులో సమ్మిళిత అభివృద్ది కనిపిస్తోందన్నారు. డ్రోన్ల ఉపయోగించి గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తులను గుర్తిస్తున్నామన్నారు. పిఎం గతి శక్తి ద్వారా అత్యాధునిక మౌలిక సదుఉపాయాలు కల్పించాలని సంకల్పించామని వెల్లడించారు. ఈ సాంకేతికత ద్వారానే దీన్ని చేయబోతున్నామని ప్రధాని మోడి పేర్కొన్నారు.కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజి , ఎర్త్‌సైన్స్ శాఖల మంత్రి డా.జితేంద్ర సింగ్ మాట్లాడుతూ ఇండియా జియోస్పేషియల్ రంగంలో 2025నాటకి 12.8శాతం ఆదాయ వృద్ధితో 63100కోట్లకు చేరుకోగలదని అంచనా వేస్తున్నట్టు వెల్లడించారు.

హైదరాబాద్ నోవాటెల్‌లో రెండవ ఐక్యరాజ్యసమితి ప్రపంచ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ 5రోజుల సదస్సులో భాంగంగా కేంద్రమంత్రి జింతేద్రసింగ్ మంగళవారం నాడు ఈ సదస్సును ప్రారంభించి ప్రసంగిచారు. దేశంలో 250కంటే ఎక్కువ జియోస్పేషియల్ స్టార్టప్‌లు వ్యర్ధ వనరులు నిర్వహణ, అటవి, వంటి అనేక డొమైన్‌లలో పనిచేస్తున్నాయన్నారు. జియోస్పేషియల్ టెక్నాలజి అనువర్తనాలను ప్రదర్శించడానికి రోడ్లు ,పట్టణ ప్రణాళిక ,మ్యాపింగ్‌లో సహాయ పడతాయన్నారు. శిక్షణ పొందిన మానవ శక్తి భారతీయ జియోస్పేషియల్ పరిశ్రమ కోసం అంతర్జాతీయంగా జిఐఎస్ సేవల మార్కెట్‌ను అభివృద్ధి చేయడంలో సహాయ పడతాయన్నారు. టెక్నాలజీ ఆధారిత స్టార్టప్‌ల విజృంభనలో దేశం పురోగమిస్తోందన్నారు. ప్రభుత్వం, పరిశ్రమలు, పరిశోధకులు ,విద్యాసంస్థలు ,పౌర సమాజం కలిసి కీలక పరిష్కారాలను రూపొందించుకునేందుకు నాణ్యమైన జియోస్పేషియల్ ఎకో సిష్టమ్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.

భారతీయ భౌగోళిక పర్యావరణ వ్యవస్థ ప్రజాస్వామ్యీకరణ దేశీయ ఆవిష్కరణలను ప్రోత్సహిస్తోందన్నారు. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకోవడం ద్వారా ఆత్మనిర్భర్ భారత్ లేదా స్వయం సమృద్ది చెందిన భారతదేశం కలను పూర్తిగా సాకారం చేయడం ద్వారా గ్లోబల్ మ్యాపింగ్ ఎకోసిష్టమ్‌లో భారతీయ కంపెనీలు పోటీపడేలా చేస్తుందన్నారు. భారత ప్రభుత్వం విప్లవాత్మక అడుగులు దీనికి కొత్త వూపునిచ్చాయన్నారు. గ్రామీణాభివృద్ది మంత్రిత్వశాఖ మ్యాప్‌లోని 21డేటా లేయర్‌లను ఉపయోగించి 45లక్షల కిలోమీటర్ల గ్రామీణ రోడ్లను మ్యాప్ చేసిందని తెలిపారు. ఇది నీటి వనరులు ,పచ్చని ప్రాంతాలు, ప్లాట్లు , పరిపాలనా ప్రయోజనాలకోసం అవసరమైన ఇతర నిర్మాణాలకు సబంధించిన సమాచారాన్ని డిజిటలైజ్ చేసిందన్నారు. అంతే కాకుండా 2.6లక్షల గ్రామ పంచాయతీలు మంత్రిత్వశాఖ పరిధిలోకి వచ్చినట్టు తెలిపారు. ఇటీవల కోవిడ్ మహమ్మారి నిర్వహణలో ఆరోగ్యాసేవా యాప్‌ను అభివృద్ధిచేయడానికి జియో ఎనేబుల్డ్ టెక్నాలజి అద్భుత ఉదాహరణ అని తెలిపారు. భవిష్యత్ జాతీయ భౌగోళిక పర్యావరణ వ్యవస్థకు సంపూర్ణ పరివర్తన అవసరం అన్నారు.

అన్ని పర్యావరణ వ్యవస్థలలో డేటా వినియోగం ,రెండవ యుఎన్‌డబ్యుజిఐజి వాటర్ షెడ్ గ్లోబల్ ఈవెంట్‌గా ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ పరిణామం సాంకేతిక నేతృత్వంలోని మానవాళి అభివృద్ధివైపు ఉంటుందని మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. ఈ సందర్బంగా మంత్రి జియోస్పటల్ ఇంకుబేటర్, సోలార్ కాలిక్యులేటర్, భూనిధి పోర్టల్, నేషనల్ టోపోనమి డేటాబేస్‌లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సైన్స్‌అండ్ టెక్నాలజి శాఖ కార్యదర్శి డా.శ్రీవారి చంద్రశేఖర్, యుఎన్‌ఎస్ డైరెక్టర్ స్టీఫెన్, యూకె ఇంగ్రిడ్, యుఎన్ ఆంటోనియో, డా.సుధాపాండేతోపాటు 150దేశాల నుంచి 700మంది ప్రతినిధులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News