Monday, December 23, 2024

నర్మదా లోయలో అరుదైన డైనోసార్ గూళ్లు

- Advertisement -
- Advertisement -

మధ్యప్రదేశ్ నర్మదాలోయలో శాకాహారియైన అరుదైన డైనోసార్ టిటానోసార్స్ గూళ్లను పురావస్తుశాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆ గూళ్లలో 256 గుడ శిలాజాలను కనుగొన గలిగారు. ఢిల్లీ యూనివర్శిటీ, మోహన్‌పుర్‌కొల్‌కతా, భోపాల్‌కు చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌సైన్సు ఎడ్యుకేషన్, రీసెర్చికి చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేపట్టారు. మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లా బాఘ్, కుక్షి ఏరియాల్లో ఈ డైనోసార్ గుడ్ల శిలాజాలు బయటపడ్డాయి.

వీటిలో చాలావరకు గుడ్లలో గుడ్లు కనిపించడం విశేషం. అంటే ఒక గుడ్డు అనేక పొరలతో కనిపించింది. ఇవి దాదాపు 66 మిలియన్ సంవత్సరాల నాటివి.ఈ తెగ డైనోసార్లు పొడవాటి మెడ, తోక కలిగి స్థూల శరీరంతో ఉంటాయి. వీటిని సౌరోపోడ్స్‌తెగకు చెందినవి అని అంటారు. ఈ రకం డైనోసార్లు నర్మదా నదీలోయలో ఆనాడు సంచరించేవని తెలుస్తోంది. 20172020 మధ్యకాలంలో జరిపిన తవ్వకాల్లో బయల్పడిన ఈ శిలాజాలు అనేక చారిత్రక, భౌగోళిక విశేషాలను చాటి చెబుతున్నాయి.

కొన్ని వేల సంవత్సరాల క్రితం భారత భూభాగంతో సీషెల్స్ అంటే దాదాపు 115 ద్వీపాల సముదాయం విడిపోయినప్పుడు టెథీస్ సముద్రం 400 కిలోమీటర్ల పొడవునా నర్మదానదిలో చొచ్చుకుని వచ్చింది. అప్పుడు ఏర్పడిన ఉప్పునీటి కయ్య ( సముద్రం ఆటుపోటు గల నదీముఖద్వారం) ప్రదేశంలో ఈ డైనోసార్ గుడ్లు బయటపడ్డాయని పరిశోధకులు వివరించారు. అయితే ఇక్కడ గమనించాల్సిన మరో విశేషం ఏమంటే సాధారణంగా గుడ్లు అన్నీ ఒక్కచోటే ఉండవు.

కొంత కొంత దూరంలో కనిపిస్తుంటాయి. కానీ ఈ గుడ్లు మాత్రం అన్నీ ఒకేచోట కుప్పలా కనిపించడం విశేషం. అనేక పొరల పెంకుతో గుడ్లు ఉండడానికి కారణం కూడా పరిశోధకులు కనుగొన్నారు. తల్లిడైనోసార్‌కు గుడ్లు పెట్టడానికి అనుకూల పరిస్థితులు లేక పోవడంతో అండవాహిక లోనే గుడ్లు ఉండిపోగా, గుడ్ల పైపెంకు అలాగే ఏర్పడిందని చెప్పారు. అనేక పొరల పెంకుతో కూడిన ఈ గుడ్లు ఒక్కొక్కటి 15 సెంమీ నుంచి 17 సెంమీ వ్యాసంలో ఉన్నాయి. ఇవన్నీ టిటానోసార్ తెగల గుడ్లే. ఒక్కో గూడులో ఒకటి నుంచి 20 గుడ్లు వరకు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News