Monday, December 23, 2024

ధోనీకి అరుదైన గౌరవం

- Advertisement -
- Advertisement -

ముంబై: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి అరుదైన గౌరవం లభించింది. ధోనీ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. టీమిండియాకు ధోనీ అందించిన అరుదైన సేవలకు గుర్తింపుగా భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) అరుదైన రీతిలో గౌరవించింది. ధోనీ ధరించిన జెర్సీ నెంబర్7కు కూడా బిసిసిఐ రిటైర్మెంట్ ప్రకటించింది. ధోనీ ధరించిన ఏడో నెంబర్ జెర్సీని ఎవరికీ కేటాయించకూదని బిసిసిఐ నిర్ణయించినట్టు తెలిసింది. అయితే దీనిపై బోర్డు నుంచి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

అయితే ధోనీ చారిత్రక ప్రదర్శనను దృష్టిలో పెట్టుకుని అతిని జెర్సీ ఇతర ఆటగాళ్లకు కేటాయించకూడదనే నిర్ణయానికి బిసిసిఐ వచ్చినట్టు సమాచారం. ఇప్పటి వరకు భారత క్రికెట్ చరిత్రలో దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్‌కు మాత్రమే ఇలాంటి అరుదైన గౌరవం లభించింది. సచిన్ ధరించిన జెర్సీ నంబర్10ను ఇతర ఆటగాళ్లకు కేటాయించకూడదని బిసిసిఐ నిర్ణయం తీసుకుంది. తాజాగా ధోనీకి ఇలాంటి గౌరవమే అందించాలని భారత క్రికెట్ బోర్డు భావిస్తున్నట్టు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News