Monday, December 23, 2024

సిద్దిపేట వాసికి అరుదైన గౌరవం

- Advertisement -
- Advertisement -

నంగునూరు: చిన్న వయసులోనే కన్న వాళ్లను పోగొట్టుకున్నాడు. అయినా ఏ మాత్రం కుంగిపోలేదు. పట్టుదలతో చదివి అనేక మందికి ఆదర్శ ప్రాయుడయ్యాడు. వందలాది మందికి వెన్నుదన్నుగా నిలుస్తున్నాడు. ఓ గ్రామస్ధాయి నుంచి ఎదిగి ఏకంగా కేంద్ర మంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. జవాన్ గార్డింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహకుడైన సల్లారం సతీష్‌రెడ్డి పట్టుదలతో చదువుకొని వ్యాపార రంగంలో ఎంతో ఎత్తుకు ఎదిగాడు.

ఈ నేపథ్యంలో డిల్లీలో కాప్సి 17వ జాతీయ సదస్సు నిర్వహించిన వేదికపై కేంద్ర మంత్రి జనరల్ డాక్టర్ వికే సింగ్ చేతుల మీదుగా యంగ్ సెక్యూరిటి ఎంటర్ ప్రెనూర్ ఆఫ్ ఇయర్ అవార్డు అందుకున్నారు. గత 12 సంవత్సరాల నుండి సెక్యూరిటీ, పెసిలిటి సర్వీసెస్ వ్యాపార రంగంలో 1000 మందికిపైగా ఉపాధి కల్పిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. సతీష్‌రెడ్డి ఈ స్ధాయికి చేరుకున్నందుకు పలువురు ప్రముఖులు అభినందించారు. గ్రామస్ధులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News