- Advertisement -
టీమిండియా స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన అరుదైన ఘనతను దక్కించుకుంది. 2024 సంవత్సరానికిగాను మంధాన ఐసిసి మహిళల వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సొంతం చేసుకుంది. కిందటి ఏడాది మహిళల వన్డేల్లో మంధాన అసాధారణ బ్యాటింగ్‌తో అలరించింది. వరుస సెంచరీలతో పెను ప్రకంపనలు సృష్టించింది. లారా వోల్వార్డ్ (సౌతాఫ్రికా), చమరి ఆటపట్టు (శ్రీలంక), అన్నాబెల్ సదర్లాండ్ (ఆస్ట్రేలియా)లతో గట్టి పోటీ పడి మంధాన ఈ అవార్డును గెలుచుకుంది. 2024లో 13 వన్డేలు ఆడిన మంధాన 747 పరుగులు చేసింది. ఇందులో 4 సెంచరీలు, మరో 3 అదర్భ సెంచరీలు ఉన్నాయి.
- Advertisement -