Sunday, January 19, 2025

గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌కు అరుదైన గుర్తింపు

- Advertisement -
- Advertisement -

తెలుగు రాష్ట్రాలలో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ గుర్తింపు పొందిన ఏకైక మార్కెట్ మాదే
గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ మాదాసు శ్రీనివాస్
గజ్వేల్ జోన్: సిద్దిపేట జిల్లా గజ్వేల్ సమీకృత మార్కెట్‌కు దేశంలో ఆహార పదార్థాల స్వచ్ఛత ప్రమాణాలను నాణ్యతను పరిశీలించి భారత ప్రభుత్వం సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ) గుర్తింపును పొందింది. రెండు తెలుగు రా ష్ట్రాలలో మొదటి మార్కెట్‌గా గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిలిచింది. శుభ్రమైన తాజా కూరగాయలు, పండ్లు అమ్ముతున్న కారణంగా భారత సంస్థ ఈ గుర్తింపును ఇచ్చింది.

దే శంలో ఎక్కడా లేని విధంగా సిఎం కెసిఆర్ ప్రత్యేక శ్రద్ధతో గజ్వేల్ పట్టణ నడిబొడ్డున అన్ని హంగులతో అత్యాధునికంగా నిర్మించిన ఈ సమీకృత మార్కెట్ ఒక ప్రత్యేకత స ంతరించుకుంది.ఇంతకు ముందు రెండు మూడు సార్లు ఇక్కడి సమీకృత మార్కెట్‌లో పండ్లు, కూరగాయల నాణ్య త, వాటిని ఎంత పరిశుభ్రంగా నిర్వాహకులు వినియోగదారులకు అందిస్తున్నారు, ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో విక్రేతలు విక్రయాలు సాగిస్తున్నారు.
రాష్ట్ర, జాతీయ స్థాయి అధికారుల బృందాలు పరిశీలించాయి. ప్రతిష్టాత్మకమైన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ సర్టిఫికెట్ ఈ మార్కెట్‌కు ఇవ్వాలంటే ఆ సంస్థ నిబంధనలు ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలి, అలా ఉంటేనే ధృవీకరణ ఇస్తారు. ఆ సంస్థ అ మలు చేస్తున్నే ప్రమాణాలు, నిబంధనలు సంపూర్ణంగా గ జ్వేల్ సమీకృత మార్కెట్‌లో అమలు చేస్తున్నారని పరిశీలక బృందాలు ,తనిఖీ అధికారులు సంతృప్తి చెందారు. ఆ మే రకు తగిన నివేదికను ప్రభుత్వానికి పంపటం దాన్ని పరిశీలించి ప్రతిష్టాత్మక గుర్తింపును ఇవ్వటం జరిగిందని ఎ ఎంసి ఛైర్మన్ మాదాసు శ్రీనివాస్ తెలిపారు.
రెండు తెలుగు రాష్ట్రాలలో జాతీయ సంస్థ గుర్తింపును సా ధించిన ఏకైక రాష్ట్రంగా అది కూడా సిఎం కెసిఆర్ నియోజకవర్గంలోని గజ్వేల్ కావటం పట్ల తమకు ఎంతో గర్వంగా ఉందని, పట్టరాని సంతోషంగా కూడా ఉందని ఆయన అ న్నారు. గజ్వేల్ సమీకృత మార్కెట్‌కు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ గు ర్తింపు సాధించటానికి కృషి చేసిన అమ్మకం దారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు, ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు, అలాగే తమను నిరంతరం ప్రోత్సహిస్తూ గజ్వేల్ ను ఒక రోల్‌మోడల్‌గా ఉండటంలో తమకు అండగా ఉం టున్న సిఎం కెసిఆర్, మంత్రి హరీష్ రావు, ఎంపి కొత్త ప్ర భాకర్ రెడ్డిలకు ఎఎంసి ఛైర్మన్ మాదాసు శ్రీనివాస్ రైతులు, మార్కెట్ పాలకవర్గం పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.–

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News