Friday, September 20, 2024

అత్యంత అరుదైన మష్కో షైరో తెగ వెలుగులోకి

- Advertisement -
- Advertisement -

పెరూ : మనకు ఇంతవరకూ తెలియని మనుష్యులు దట్టమైన అమెజాన్ అడవులలో ఉన్నట్లు ఇప్పుడు వెల్లడైంది. ఇప్పుడు సాహసికుల కెమెరాల కంటికి చిక్కిన ఈ అరుదైన తెగ పేరు మష్కో షైరో తెగ అని నిర్థారించారు. ఇంతకాలం ఎక్కడా వీరి ఉనికి గురించి ఎవరికి తెలియలేదు. అయితే ఇటీవలి కాలంలో వీరుండే ప్రాంతాన్ని పెరూ ప్రభుత్వం కంపెనీలకు లీజుకు ఇవ్వడంతో వీరు దాడికి గురవుతున్నారు.

ఆహార కొరత వంటి పరిణామాలతో ఈ తెగకు చెందిన వారు అడవులు వదిలి బయటకు రావడంతో వీరి గురించి మిగిలిన ప్రపంచానికి తెలిసివచ్చింది. తెగల ఉనికికి సంబంధించి వారి హక్కుల గురించి పోరాడే సర్వైవల్ ఇంటర్నేషనల్ అనే సంస్థ తమ బృందాలను రంగంలోకి దింపిన క్రమంలో వీరిని గుర్తించి, వీరి ఫోటోలను, వీడియోలను ఇంటర్నెట్‌లో పొందుపర్చింది. పెరూ సమీపంలోని లాస్ పిడ్రాస్ నదికి సమీపంలో వీరు సంచరిస్తూ ఉండగా ఈ సంస్థ కనుగొంది.

ఈ తెగల వారు తరాలుగా ఉంటున్న భూభాగాన్ని పెరూ ప్రభుత్వం కంపెనీలకు విక్రయించడంతో ఈ అజ్ఞాతపు తెగ వారు చేసేది లేక బయటకు వచ్చారని స్థానిక దేశీయ సంస్థ పెనామడ్ నేత అల్ఫ్రెడో తెలిపారు. ఆహారం కోసం ఈ తెగ వారు ఇప్పుడు గ్రామాలపై పడటంతో స్థానికులకు వీరికి మధ్య పెద్ద ఎత్తున పోరు జరగవచ్చునని ఈ క్రమంలో అధునాతన పరిజ్ఞానం, ఆయుధ సంపత్తి లేని అరుదైన మష్కో షైరో తెగ దెబ్బతింటుందని, ఇది అంతరించిపోయినా ఆశ్వర్యపడాల్సిన అవసరం లేదని పర్యావేరణ వేత్తలు, హక్కుల సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఓ తెగను పరిరక్షించలేకపోతున్నందుకు పెరూ ప్రభుత్వంపై నిరసనలు వ్యక్తం అయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News