Wednesday, January 22, 2025

ప్రభుత్వ ఆసుపత్రిలో 90 ఏళ్ల వృద్ధురాలికి అరుదైన ఆపరేషన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో 90 ఏళ్ల వృద్ధురాలికి అరుదైన ఆపరేషన్ విజయవంతం చేశారు. రామవరం కి చెందిన ఫాతిమాభి (90) కడుపులోని క్యాన్సర్ కణితికి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆపరేషన్ చేశారు. మూడు నెలలుగా కడుపు నొప్పితో బాధపడుతున్న ఫాతిమాభి కొత్తగూడెం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో గత గురువారం వైద్యులను సంప్రదించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు కడుపులో ఏడు కిలోల క్యాన్సర్ కణితి ఉన్నట్లు గుర్తించారు.

ఆమెకు బుధవారం విజయవంతంగా ఆపరేషన్ చేసి క్యాన్సర్ కణితిని తొలగించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఆపరేషన్ లో సర్వజన ప్రభుత్వాసుపత్రి సూపర్డెంట్ కుమారస్వామి ఆధ్వర్యంలో డాక్టర్లు సురేందర్, నాగమణి, స్రవంతి, కుమారి, టెక్నీషియల్ ఆదినారాయణ, కోటి, పవన్, హైమావతి, ప్రియ, పాల్గొన్నారు. ఆపరేషన్ విజయవంతం కావడం పట్ల బాధిత కుటుంబ సభ్యులు హర్ష వ్యక్తం చేశారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News