గోషామహల్: కోఠిలోని ప్రభుత్వ ఈఎన్‌టీ ఆసుపత్రి వైద్యులు అరుదైన కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు. ఈ మేరకు బుధవారం ఈఎన్‌టీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ టి. శంకర్ ఆపరేషన్ సంబంధిత వివరాలను వెల్లడించారు. హన్మకొండ జిల్లా నడికూడ రాయపర్తి గ్రామానికి చెందిన విష్ణు (30) గత కొంతకాలంగా చెవి (చెవులు వినిపించక) సమస్యలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు చికిత్సల నిమిత్తం విష్ణును ఈ ఎన్‌టీ ఆసుపత్రిలో చేర్పించారు.
అతన్ని పరీక్షించిన వైద్యులు వివిధ వైద్య పరీక్షలు నిర్వ హించి, కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్స నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు డాక్టర్ కరుణ, డాక్టర్ డికె వీణ తదితరుల బృం దం కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు. కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించిన వైద్యులు, సిబ్బందిని ఈఎన్‌టీ ఆ సుపత్రి సూపరింటె ండెంట్ డాక్టర్ టి శంకర్ అభినందించారు. ఆపరేషన్ విజయవంతంగా పూర్తవ్వడంతో విష్ణు, అతని కుటుంబ సభ్యులు వైద్యుల కు కృతజ్ఞతలు తెలిపారు.