ఈ టెస్టులో రవీంద్ర జడేజా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఒక టెస్టులో బ్యాట్‌తో సెంచరీ చేసి బంతితో ఐదు వికెట్లు తీసిన భారత క్రికెటర్ల జాబితాలో నాలుగో క్రికెటర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో విను మన్కడ్, పాలి ఉమ్రిగర్, రవిచంద్రన్ అశ్విన్‌లు జడేజా కంటే ముందున్నారు. ఇక జడే జా నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. కాగా జడేజాకు ఈ ఘనత అందుకోవడం ఇది రెండోసారి. 1952లో విను మన్కడ్ తొ లిసారి.. ఇంగ్లండ్‌పై ఆడిన టెస్టులో బ్యాట్ తో 184 పరుగులు చేయడమే గాక బంతితో ఐదు వికెట్లు (5/196) పడగొట్టాడు. 1962లో పాలి ఉమ్రిగర్.. వెస్టిండీస్‌తో ఆడిన టెస్టులో బ్యాట్‌తో 172 రన్స్ చేశాడు.
బంతితో ఐదు వికెట్లు (5/107) తీశాడు. ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఈ ఘనతను మూడు సార్లు సాధించడం విశేషం. 2011లో వెస్టిండీస్‌తో ముంబై వేదికగా జరిగిన టెస్టులో 103 పరుగులు చేసిన అశ్విన్.. ఐదు వికెట్లు (5/156) పడగొట్టాడు. 2016లో అతడు.. వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో బ్యాట్ పట్టి సెంచరీ (113) చేయడమే గాక బంతితో ఏడు (7/83) వికెట్లు తీశాడు. 2021లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో శతకం (106) చేసి బంతితో మరో ఫైఫర్ (5/43) దక్కించుకున్నాడు.