అయోధ్య: అయోధ్యలోని రామమందిరంలో ప్రతిష్టించనున్న శ్రీరాముని విగ్రహం కోసం అత్యంత అరుదైన శిలలు బుధవారం రాత్రి నేపాల్ నుంచి ఇక్కడకు చేరుకున్నట్లు ఆయల ట్రస్టు నిర్వాహకుడు ఒకరు తెలియచేశారు. ఈ శిలలతో శ్రీరాముని విగ్రహాన్ని మలచనున్నట్లు ఆయన తెలిపారు. ఈ శిలలను శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు గురువారం మధ్యాహ్నం అందచేయగా వాటికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ శిలలను 51 మంది వేద పండితులతో పూజలు నిర్వహించినట్లు ఆయన చెప్పారు.
నేపాల్‌లోని జానకీ మందిరం మహంత్ తాపేశ్వర్ దాస్ ఈ శిలలను రామందిర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్‌కు బహూకరించారని అధికారులు తెలిపారు. ఈ శిలలను శ్రీరాముని బాల్యరూపంలో చెక్కి వాటిని ప్రధాన ఆలయంలో ప్రతిష్టించనున్నట్లు వారు చెప్పారు. వచ్చే ఏడాది జనవరి నాటికి ఆలయ నిర్మాణం పూర్తి కానున్నట్లు వారు చెప్పారు. పవిత్రమైన రెండు శిలలతో జనవరి 25న నేపాల్‌లోని ముస్తంగ్ జిల్లా నుంచి విశ్వ హిందూ పరిషద్ జాతీ కార్యదర్శి రాజేంద్ర సింగ్ పంకజ్ బలయ్దేరి బుధవారం రాత్రి అయోధ్య చేరుకున్నారు.