హైదరాబాద్ : వేగంగా పెరుగుతున్న వెన్నెముక వైకల్యం, శరీరంలోని మొండెంపై భాగం ఒకవైపు వంగినట్లుగా పెద్దదిగా మారుతూ, నడవడానికి అవస్థలు పడుతూ వెన్నునొప్పితో పాటుగా తీవ్రమైన గూని సమస్యతో ప్రాణాపాయ స్థితికి చేరిన బాలుడికి కిమ్స్ వైద్యులు ప్రాణదానం చేశారు. వరంగల్‌కు చెందిన 15 ఏళ్ల బాలుడికి ఎనిమిదేళ్ల వయస్సులో వెన్నెముక వంకర పోతున్నట్లు తల్లిదండ్రులు గుర్తించారు. దీంతో స్థానికం గా ఉండే డాక్టర్ల వద్దకు తీసుకెళ్లారు. ఎక్స్‌రే తీసిన వైద్యులు పుట్టకతో వీపులో వచ్చే ఎంతో సంక్లిష్టమైన వెన్నెముక వైకల్యం బాలుడిలో వృద్ధి చెందుతున్నట్లు గమనించారు.
సంక్లిష్టమైన వెన్నుపూస ఎముకలు, పక్క టెముకలు కలిసిపోయి వయస్సుతోపాటు వేగంగా అభివృద్ధి చెందుతాయని చెప్పారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు వైద్యుల సలహాలు తీసుకుని, క్లిష్టమైన సమస్యగా తెలుసుకుని అత డి వెన్నెముక సమస్యతో క్రమంగా అతడి కాళ్లు, మూత్రాశయంపై నియంత్రణ కోల్పోయే ప్రమాదముందని తెలుకుని కిమ్స్ వైద్యులు డా.సురేష్ చీకట్ల సంప్రదించడంతో బాలుడి పరిస్థితి పరిశీలించి శస్త్ర చికిత్స చేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ పలు పరీక్షలు నిర్వహించామని ఎక్స్‌రే, పూర్తి వెన్నెముకను సిటి స్కానింగ్ వంటి పరీక్షలు చేసి ర్యాపిడ్ ప్రోగ్రెసివ్ ఆప్ కాంజినిటల్ డోర్స ల్ కైఫీ స్కోలియాసిన్ అనే సమస్యతో బాధపడుతున్నట్లు పరీక్షల్లో తేలిందన్నారు.
దీంతో వెన్నెముక నావిగేషన్ పరికరాలతో సర్జరీ చేయా లని నిర్ణయించినట్లు తెలిపారు. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న తల్లిదండ్రులకు ఖర్చు తగ్గించేందుకు ఈ తర హా పరికరాలతో ఆపరేషన్ చేసి ఖర్చును తగ్గించాలని నిర్ణయించుకుని ఈ సర్జరీకి సాధారణంగా పూర్తి చేయాలంటే 6 నుంచి 8గంటల సమయం పడుతుందని కానీ ఒకే చికిత్స ద్వారా అన్ని రకాల సమస్యలను పరిష్కారించాల ని నిర్ణయం తీసుకుని వైద్య చికిత్స చేయడంతో ప్రస్తుతం బాలుడు చక్కగా నడుస్తుండటంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసినట్లు తెలిపారు.