Thursday, January 23, 2025

ఆరోగ్యశ్రీలో అరుదైన శస్త్రచికిత్స

- Advertisement -
- Advertisement -

కరీంనగర్‌లో 16 ఏళ్ల బాలుడికి పునర్జన్మ ప్రసాదించిన ఒమెగా శుశ్రుత వైద్యులు

Rare surgery in Arogyasree

మనతెలంగాణ/ హైదరాబాద్ : ఆరోగ్యశ్రీ పథకంలో అరుదైన క్యాన్సర్ శస్త్ర చికిత్సను కరీంనగర్ ఒమెగా శుశ్రుత వైద్యులు ఉచితంగా నిర్వహించారు. శరీరంలో పక్కటెముకులతో పాటు గుండె, ఊపిరితిత్తుల భాగాలకు వ్యాపించిన క్యాన్సర్‌కు ఒమెగా శుశ్రుత హాస్పిటల్ వైద్యులు అత్యంత క్లిష్టమైన సర్జరీ నిర్వహించి, 16 ఏళ్ల బాలుడికి క్యాన్సర్ నుంచి విముక్తి కల్పించారు.

ఇలాంటి అరుదైన వ్యాధి పది లక్షల మందిలో కేవలం ఇద్దరి లో మాత్రమే కనిపిస్తుందన్నారు. రూ.6 లక్షల ఖర్చయ్యే ఈ శస్త్ర చికిత్సను ఆరోగ్యశ్రీ పథకంలో ఉచితంగా నిర్వహించారు. వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా కొడిమ్యాల్ గ్రామానికి చెందిన ఎలుముల సృజిత్ (16) చెస్ట్ వాల్ క్యాన్సర్ (ఛాతి పక్కటెముకలకు క్యాన్సర్)తో బాధపడుతూ డిసెంబర్‌లో ఒమెగా శుశ్రుత హాస్పిటల్లో చేరారు. రోగి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించిన వైద్యులు అతడికి గుండె, ఊపిరితిత్తుల్లో ఉన్న ట్యూమర్‌ను వెంటనే తొలగించకపోతే ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని అయితే వెంటనే శస్త్ర చికిత్స చేసిన ప్రాణానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నందున ముందుగా ట్యూమర్ పరిమాణాన్ని తగ్గించడానికి కీమో ఇచ్చి, ఆ తర్వాత సర్జరీ చేయాలని నిర్ణయించుకున్నారు. డాక్టర్ విష్ణువర్ధన్‌రెడ్డి నేతృత్వంలో డాక్టర్ జంపాని అనిల్ వైద్య బృందం ఏడు గంటలపాటు శ్రమించి అత్యంత క్లిష్టమైన ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించి సృజిత్‌కు కొత్త జీవితం ప్రసాదించారు. ఈ సందర్భంగా డాక్టర్ జంపాని అనిల్ మాట్లాడుతూ ప్రస్తుతం రోగి ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశామని చెప్పారు. సృజిత్ భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా సాధారణ జీవితం గడపగలుగుతారని తెలిపారు. ఒమేగా సుశ్రుత ఆసుపత్రిలో అత్యంత అనుభవజ్ఞులైన వైద్యులు, అంకితభావంతో కూడిన సిబ్బంది అత్యాధునిక ఆరోగ్య సంరక్షనే ధ్యేయంగా పని చేస్తుందన్నారు. అధునిక సాంకేతికతలు, పురోగతులను అందిపుచ్చుకోవడంలో కూడా ఎల్లప్పుడు ముందుంటామని ఎలాంటి ఎమర్జెన్సీలు అయినా నిర్వహించడానికి నిరంతరం సిద్ధంగా ఉన్నామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News