- Advertisement -
మనతెలంగాణ/ హైదరాబాద్ : ఓ రోగి ఉపరిత్తులు వద్ద గుండెకు దగ్గరలో కిడ్నీ స్టోన్ ఏర్పడగా.. నిమ్స్ వైద్యులు విజయవంతంగా తొలగించారు. మంగళవారం నిమ్స్ ఆస్పత్రిలో అత్యంత అరుదైన ఈ సర్జరీని యూరాలజీ విభాగం వైద్యులు సి.రాంరెడ్డి, రాహుల్ దేవరాజ్ విజయవంతంగా నిర్వహించారు. 22 ఏళ్ల యువకుడికి కడుపు నొప్పి, జ్వరం, మూత్ర విసర్జన సమయంలో నొప్పి తరుచూ రావడంతో వైద్యపరీక్షలు నిర్వహించగా.. కిడ్నీలో స్టోన్స్ ఉన్నట్లు గుర్తించారు. ఎడమ ఊపిరితిత్తుల, గుండె వైపు ఈ స్టోన్ ఉండడంతో శస్త్రచికిత్సకు సవాలుగా మారింది. ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా యూరాలజీ విభాగం వైద్యులు ఉచితంగా శస్త్ర చికిత్స నిర్వహించారు. దాదాపు రూ.5 లక్షల వ్యయం అయ్యే అయ్యే ప్రక్రియను ఆరోగ్యశ్రీలో అందించారు.
- Advertisement -