Friday, December 20, 2024

మహిళకు అరుదైన టిప్స్ ప్రొసీజర్ చికిత్స

- Advertisement -
- Advertisement -

సిటీ బ్యూరో ః లివర్ సిర్రోసిస్‌ అనే వ్యాధితో బాధపడుతున్న 75 ఏళ్ల మహిళకు మొదటిసారిగా లక్డీకాపూల్‌లోని వాసవి ఆసుపత్రిలో టిప్స్ ప్రొసీజర్ అనే అరుదైన చికిత్స నిర్వహించారు. లివర్ సంబంధింత వ్యాధుల్లో చివరి స్జేట్ అయిన లివర్ సిర్రోసిస్ వ్యాధి కారణంగా ఓ మహిళ కడుపులో నీరు చేరి ఆయాసం, ఊపిరి తీసుకుకోవడం కష్టంగా మారడంతో గత రెండు వారాల కిత్రం వాసవి ఆసుపత్రికి వచ్చినట్లు ఆసుపత్రివైద్యులు వెల్లడించారు. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా 5 ఏళ్ల కిత్రం నుంచి లివర్ సిర్రోసిస్‌తో భాధపడుతున్న ఈ మహిళకు డయోబిటీస్‌య బీపి సిక్ సైనల్ సిండ్రోమ్, అనీమియా, ఆస్తమా, హైపోథైరాయిట్ .

హైపటో రీనల్ సిండ్రోంంతో బాధపడుతున్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. ఇలాంటి వారికి లివర్ మార్పిడి చేయాల్సిటుందని అయితే ఆసుపత్రిలో వైద్యలు ఈ మహిళకు టిప్స్ ప్రోసీజర్ (ట్రాన్స్ జుబులార్ ఇంట్రాహైపాటిక్ ఫోర్జోసిస్టమిక్ షన్) ప్రొసీజర్ సాయంతో అరుదైన చికిత్స నిర్వహించినట్ల వైద్యబృందం వెల్లడించింది. ఈ అరుదైన చికిత్సలో క్రిటికల్ కేర్ డాక్టర్ రఘు కొండ్లే, అనస్తీషియా విభాగం డాక్టర్ శ్రీవాణి, గ్యాస్టోఎంట్రాలజిస్ డాక్టర్ కె.సతీష్ తో పాటు క్యాథ్‌ల్యాబ్ టీం, ఆసుపత్రి ఛైర్మన్ ఎ.చంద్రయ్య, ప్రధాన కార్యదర్శి కొండ్లె మల్లీకార్జున్, కోశాధికారి రఘునందన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News