Friday, December 20, 2024

ప్రమాదానికి గురైన పేద మహిళకు ఉచితంగా అరుదైన చికిత్స

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః అత్యంత క్లిష్ట పరిస్థితులలో పేదరికంతో దిక్కు తోచని స్థితిలో మరో హాస్పిటల్ నుండి మార్చబడిన రోగికి పూర్తిగా ఉచిత వైద్యాన్ని అందించి రెండు నిండు ప్రాణాలను విరించి హాస్పిటల్ వైద్యులు కాపాడారు. దిక్కు తోచని పరిస్థితులలో (34) గర్భిణి బైకుపై వెళుతుంటే ప్రమాదం జరగడంతో తలకు తగిలిన గాయాల కారణంగా ఆమె మెదడులోని నరాలు చిట్లడం, మెదడులోని రక్తం గట్టకట్టడం వంటి లక్షణాలతో హాస్పిటల్ లో చేర్చారు. వైద్యులు తలకు సర్జరీ చేయడమే కాకుండా పుర్రె ఎముకను కొంత తొలగించి శస్ర చికిత్స చేశారు. అనంతరం ఆమెను వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించాల్సి రావడం అది భారీ ఖర్చుతో కూడుకున్న పని అని తెలియడంతో అంత నిధులు వెచ్చించే స్థోమత లేని పరిస్థితులలో భర్త, ఇతర కుటుంభ సభ్యులు విషయాన్ని లతామా ఫౌండేషన్ మేనేజింగ్ ట్రీస్టీ, ఛైర్‌పర్సన్ మాధవి లత దృష్టికి తీసుకు రావడంతో ఆమె విరంచి ఆసుపత్రి వైద్య బందాన్ని సంప్రదించింది.

వెంటనే విరించి హాస్పిటల్‌కు తీసుకొని వచ్చే నాటికి తను సెప్టిక్ షాక్ కు గురై సుదీర్ఘకాలం వెంటిలేషన్ పై ఉండడంతో వచ్చిన నిమోనియాతో భాదపడుతోంది. అదే సమయంలో మెదడుకు తగిలిన గాయం కారణంగా కుడి చేతి వైపు కొంత మేర ఆమెకు పక్షవాతం ఏర్పడడం ఆమె ఆరోగ్య సమస్యను మరింత జఠిలం చేసింది. ఇటువంటి పరిస్థితులలో హాస్పిటల్ కు వచ్చిన మహిళ గర్భిణి కావడంతో పాటూ ఆమె కడుపులో ఉన్న శిశువు ఆరోగ్యాన్ని కూడా కాపాడుతూ మహిళకు ప్రాణదానం చేయడం విరించి హాస్పిటల్ వైద్యులకు సరికొత్త సవాల్ ను విసిరింది. ఈ సవాల్ ను స్వీకరించిన విరించి వైద్య బృందం అడ్మిషన్ సయమం నుండి డిశ్చార్చి చేసే వరకూ ఎంఐసియులోనే ఉంచి చికిత్స చేయడంతో సదరు మహిళ పూర్తిగా కోలుకుంది. ఈ సందర్భంగా విరంచి సీఈవో డా. సాయి రవి శంకర్‌మాట్లాడుతూ వైద్య పరిభాషలోనే ఎంతో క్లిష్టమైన రోగికి చికిత్స అందించి బాగు చేయడమే కాకుండా పూర్తిగా ఉచితంగా వైద్యం అందించడంతో విరించి హాస్పిటల్ మరో మారు తన నైపుణ్యాన్ని, మానవత్వాన్ని చాటుకొందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News