Monday, December 23, 2024

ముసలి నక్కలన్నీ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాయి:రసమయి బాలకిషన్

- Advertisement -
- Advertisement -

ముసలి నక్కలన్నీ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాయని బిఆర్‌ఎస్ నేత, మాజీ ఎంఎల్‌ఎ రసమయి బాలకిషన్ అన్నారు. ఎంపీ కేశవరావుకు మతి భ్రమించినట్లుందని అన్నారు. మిలియన్ మార్చ్‌లో కేశవరావును కోడిగుడ్లతో కొట్టిన ఘటనలను గుర్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఇవాళ పాట లేదు మాట లేదని కేశవరావు మాట్లాడుతున్నారని.. ఆయన భాష ఎవరికీ అర్ధం కాదని విమర్శించారు. కేశవరావు బిడ్డ అంటే ఎవరో తెలియదని.. అలాంటి ఆమెకు కెసిఆర్ మేయర్ పదవి ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణ భవన్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పాటకు చరిత్ర లేకపోతే జయ జయహే తెలంగాణ పాటను రాష్ట్ర గీతంగా ఎలా తీసుకున్నారని రసమయి ప్రశ్నించారు. తెలంగాణ సంస్కృతిని అవమానించడం కేకేకు సరికాదని వ్యాఖ్యానించారు. కేశవరావు వెంటనే కళాకారులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆయన ఇంటి ముందు ధూం ధాం నిర్వహిస్తామన్నారు. ఓట్ల కోసం గద్దర్ అన్నను వాడుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మొదట్నుంచి తెలంగాణ బతుకుల మీద విషం చిమ్ముతూనే ఉందన్నారు.

కడియం శ్రీహరి మాదిగ ద్రోహి
కడియం కావ్యకు బిఆర్‌ఎస్ పార్టిలో సభ్యత్వం లేదని, కడియం శ్రీహరి ఏ బడిలో చదువుకున్నారో.. ఎక్కడ బడి చెప్పారో ఎవరికీ తెలియదని అన్నారు. కడియం శ్రీహరి మాదిగ ద్రోహి అని.. మాదిగ జాతి అంటేనే ఆయనకు కళ్ల మంట అని రసమయి పేర్కొన్నారు. శ్రీహరి మాదిగలకు ద్రోహం చేశారని,కాబట్టి కచ్చితంగా ఆయనను ఓడిస్తామని హెచ్చరించారు. కడియం శ్రీహరి వైఖరి వల్లనే తాడికొండ రాజయ్య, ఆరూరీ రమేష్ వెళ్ళిపోయారని ఆరోపించారు. మాదిగలకు ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదని, కాంగ్రెస్ పార్టీ మాదిగలకు సీటు ఇవ్వకపోతే చావు డప్పు కొడుతామని చెప్పారు. వరంగల్‌లో కడియం శ్రీహరిపై చావు డప్పు కొడుతామని హెచ్చరించారు. మా పార్టీ ఆదేశిస్తే తాను వరంగల్ నుంచి పోటీ చేస్తానన్నారు. ఎస్‌సి వర్గీకరణ పేరుతో మాదిగల ఓట్ల కోసం బిజెపి తాపత్రయ పడుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో మాదిగలకు ఎన్ని సీట్లు ఇచ్చారనే దానిపై మందకృష్ణ మాదిగ ఎందుకు మాట్లాడం లేదని రసమయి ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News