మంచి ఉద్యోగం, లక్షల్లో జీతం కావాలంటే ఐఐటీల్లోనో, ఐఐఎంలలోనో చదవాలా? అక్కర్లేదని నిరూపించింది ఆ అమ్మాయి. 21 ఏళ్ల ఆ అమ్మాయి పేరు రాశి బగ్గా. నయా రాయ్ పూర్ ఇంటర్నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటి-ఎన్ఆర్) లో చదువుతున్న రాశి.. క్యాంపస్ సెలెక్షన్ లో భలే చాన్స్ కొట్టేసింది. ఆమెకు 85 లక్షల వార్షిక వేతనంపై ఒక సంస్థ ఉద్యోగమిచ్చింది.
నిజానికి రాశికి కొన్ని రోజుల ముందే ఓ మంచి ఉద్యోగం దొరికింది. అయినా మరిన్ని ఇంటర్వ్యూలలో పాల్గొనడం మొదలుపెట్టింది. దాంతో తాజాగా 85 లక్షల జీతంతో మరో ఉద్యోగం సంపాదించింది. ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే రాశిని ఎంపిక చేసిన సంస్థే ఐఐఐటి-ఎన్ఆర్ కు చెందిన యోగేశ్ కుమార్ అనే మరో విద్యార్థికి 56 లక్షల వార్షిక వేతనంపై సాప్ట్ వేర్ డెవలప్ మెంట్ ఇంజనీర్ గా ఉద్యోగం ఇచ్చింది.
2020లో ఐఐఐటి-ఎన్ఆర్ లో చదివిన రవి కుశశ్వ అనే విద్యార్థికి ఓ బహుళజాతి కంపెనీ కోటి రూపాయల వేతనంపై ఉద్యోగమిచ్చింది. అయితే కోవిడ్ కారణంగా అతను ఉద్యోగంలో చేరలేకపోయాడు.