Friday, April 4, 2025

‘పక్కా కమర్షియల్’ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు..

- Advertisement -
- Advertisement -

మ్యాచో స్టార్ గోపీచంద్, అందాల బ్యూటీ రాశీఖన్నా జంటగా నటించిన చిత్రం పక్కా కమర్షియల్. బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా రాశీఖన్నా మీడియాతో మాట్లాడుతూ.. “ఈ సినిమాలో లాయర్ ఝాన్సీ క్యారెక్టర్‌తో దర్శకుడు మారుతి నాకు మంచి స్కోప్ ఇచ్చారు. ఈ పాత్రతో నాకు మంచి పేరు వస్తోంది. నేను చాలా సినిమాలను ఆడియన్స్‌తో పాటు చూస్తుంటాను. ఈ సినిమాను కూడా ప్రేక్షకులతో కలిసి థియేటర్‌లో చూశాను. ఆడియన్స్ అంతా సినిమాను బాగా ఎంజాయ్ చేయడంతో ఆనందంగా ఉంది. ప్రస్తుతం తెలుగులో మూడు సినిమాలకు సైన్ చేశాను. ఒక వెబ్ సిరీస్ షూట్ అయిపోయి ప్రస్తుతం డబ్బింగ్ జరుగుతోంది. అలాగే కార్తీతో చేస్తున్న ‘సర్ధార్’ మూవీ షూటింగ్ ఇంకాస్త మిగిలి ఉంది” అని అన్నారు.

Rashi Khanna about Pakka Commercial After Watching

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News