Monday, December 23, 2024

పదహారో ఏటనే ప్రేమలో పడ్డా..

- Advertisement -
- Advertisement -

Rashi Khanna said about her love

 

‘ఈ సృష్టి నడిచేది ప్రేమ వల్లే. అది ఈ సృష్టికి ఆక్సిజన్ లాంటిది’. అని యంగ్ హీరోయిన్ రాశి ఖన్నా అన్నారు. ఆమె తాజాగా ప్రేమ గురించి మాట్లాడుతూ ప్రేమని గౌరవించినవాళ్లే మిగిలిన బంధాలకూ విలువ ఇస్తారన్నది నా నమ్మకం. కాకపోతే.. నేనెప్పుడూ ‘లవ్ ఎట్ ఫస్ట్ సైట్’ అనే మాటని నమ్మను. తొలి చూపులోనే ప్రేమించడం ఒక్క సినిమాల్లోనే సాధ్యం. బయట చాలా లెక్కలుంటాయి. ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికీ, జీవితాంతం కలిసి బతకొచ్చు అనే నమ్మకం కలగడానికి కొంత సమయం పడుతుంది. ఇకా, నాకూ ఓ ప్రేమకథ ఉంది. నా పదహారో ఏటనే ఓ అబ్బాయిని ప్రేమించా. అది ప్రేమ కాదు ఆకర్షణే అని తెలియడానికి ఎంతో కాలం పట్టలేదు. అందుకే వెంటనే ఆ ప్రేమ నుంచి బయట పడిపోయా. ఇక ప్రస్తుతం నేను ఎవరితో ప్రేమలో లేను. నా దృష్టి అంతా సినిమాలపైనే ఉంది. హీరోయిన్‌గా విభిన్న కథా చిత్రాలను చేస్తూ ప్రేక్షకులను మెప్పించాలన్నదే నా లక్ష్యం అని అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News