Monday, December 23, 2024

మొదట్లో చాలా ఇబ్బంది పడ్డా..

- Advertisement -
- Advertisement -

హీరోయిన్ రాశి ఖన్నా తెలుగులో ఎంట్రీ ఇచ్చినప్పుడు ముద్దుగా బొద్దుగా ఉండేది. సాయి ధరమ్ తేజ్ నటించిన సుప్రీమ్ సినిమాలో బెల్లం శ్రీదేవిగా బబ్లీగా కనిపించి పాపులర్ అయింది ఈ భామ. ఆ తర్వాత అనేక హిట్ చిత్రాలు చేసింది. కానీ అకస్మాత్తుగా నాలుగేళ్ల క్రితం సన్నబడడం మొదలుపెట్టింది. ఇప్పుడు పూర్తిగా సైజ్ జీరోలోకి వచ్చింది. దానికి కారణం ఉందట. “మొదట్లో అందరూ నన్ను గ్యాస్ బండ అని కామెంట్ చేశారు. దాంతో ఇబ్బంది పడ్డా. మొదట్లోనే లావు తగ్గాలని ప్రయత్నించా. కానీ తగ్గలేకపోయా. లావు తగ్గడానికి చాలా సమయం పట్టింది”అని రాశి ఖన్నా చెప్పింది.

ఆమె ఇప్పుడు హిందీలో వెబ్ సిరీస్‌లు కూడా చేస్తోంది. అక్కడ సినిమా ఆఫర్లు కూడా వస్తున్నాయి. తెలుగు, తమిళంలో ఎన్నో సినిమాలు చేసి పాపులర్ అయిన తర్వాత బాలీవుడ్‌కి వెళ్ళగానే సౌత్ సినిమాల అనుభవాల గురించి ఏకరువు పెడుతుంటారు హీరోయిన్లు. రాశి ఖన్నా కూడా అలాగే ఇప్పుడు బాలీవుడ్ మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఆ ఇంటర్వ్యూలలో బాడీ షేమింగ్ గురించి చెప్పింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News