Monday, December 23, 2024

ICC T20I ర్యాంకింగ్స్: నెంబర్ 1 బౌలర్‌గా రషీద్ ఖాన్

- Advertisement -
- Advertisement -

ఐసిసి విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్ లో అప్ఘానిస్తాన్ స్టార్ ప్లేయర్ రషీద్ ఖాన్ టీ20 ఫార్మాట్ లో నెంబర్ వన్ బౌలర్ గా నిలిచాడు. రషీద్ 710 రేటింగ్స్ తో నెం1 ర్యాంకుల్లో ఉండగా, శ్రీలంక ప్లేయర్ హసరంగా 695 రేటింగ్ తో 2వ ర్యాంకు, అప్ఘాన్ ప్లేయర్ ఫజల్హక్ ఫారూఖీ 692 రేంటింగ్ తో 3వ ర్యాంకు, ఆస్ట్రేలియా ప్లేయర్ జోష్ హాజిల్ వుడ్ 690 రేటింగ్ తో 4 ర్యాంకులో ఉన్నాడు. షార్జాలో పాకిస్థాన్‌తో జరిగిన చారిత్రాత్మక సిరీస్‌లో ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించిన తర్వాత రషీద్ ఖాన్ బౌలర్ల ICC T20I ర్యాంకింగ్స్‌లో తొలిస్థానంలో నిలిచాడు.

2018లో మొదటిసారిగా అతి తక్కువ ఫార్మాట్‌లో నంబర్ 1 బౌలర్‌గా మారిన రషీద్, 2022లో జరిగిన T20 ప్రపంచ కప్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. మార్చిలో షార్జాలో పాకిస్థాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల్లో రషీద్ ఒక్కో వికెట్ తీశాడు. ఓవర్‌కి 5 పరుగుల మిర్లీ ఎకానమీ రేటుతో రషీద్ ఇప్పుడు 710 రేటింగ్ పాయింట్లను కలిగి ఉన్నాడు. T20Iలలో తాజా బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో రెండవ స్థానంలో ఉన్న హసరంగ కంటే 15 ఎక్కువ.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News