పాక్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్
కరాచీ: ఆఫ్ఘనిస్థాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్‌పై పాక్ మాజీ ఆటగాడు పొగడతల వర్షం కురిపించాడు. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడుతూ.. ‘మాజీ స్టార్ బౌలర్ వసీం అక్రమ్ కంటే రషీద్ ఖాన్ గొప్ప క్రికెటరని లతీఫ్ పేర్కొన్నాడు. 2025 ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు లతీఫ్ ఈ వ్యా ఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారా యి. రషీద్ ఖాన్ ఆఫ్ఘనిస్థాన్‌ను ప్రపంచంలో గుర్తింపును పొందేలా చేశాడు.
రషీద్ ఖాన్‌కు నాదొక సలహా. మీ టెస్ట్ జట్టును పటిష్ఠంగా మార్చుకొని సాంప్రదాయ క్రికెట్‌లో రాణిస్తే అఫ్ఘన్ క్రికెట్‌కు మరింత గుర్తింపు వస్తుందిని, పాకిస్థాన్‌తో మరిన్ని టెస్ట్‌లు ఆడండి’ అని లతీఫ్ సూచించాడు. కాగా.. ఈ వ్యాఖ్యలపై వసీం అక్రమ్ స్పందిస్తూ.. పాకిస్థాన్ తరఫున దాదాపు 200 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన లతీఫ్ ఈ వ్యాఖ్యలు చేయడం తనకు బాధగా అనిపించిందని తెలిపాడు. రషీద్ ఖాన్ తన కంటే గొప్ప క్రికెటరేనని వసీం అక్రమ్ చెప్పాడు.