- Advertisement -
జింబాబ్వే, ఆఫ్ఘానిస్తాన్ మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ లో రషీద్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రషీద్ 27.3 ఓవర్లలో 94 పరుగులు ఇచ్చి 4 వికెట్లు సాధించాడు. ఫలితంగా జింబాబ్వే మొదటి ఇన్నింగ్స్‌లో 243 పరుగులకు కుప్పకూలింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో రషీద్ ఖాన్ 6 వికెట్లు పడగొట్టాడు. ఈ విధంగా ఈ మ్యాచ్‌లో మొత్తం 10 వికెట్లు తీశాడు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి జింబాబ్వే 8 వికెట్లకు 205 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో గెలవాలంటే జింబాబ్వే ఇంకా 73 పరుగులు చేయాల్సి ఉంది. అయితే ఆఫ్ఘనిస్థాన్‌కు 2 వికెట్లు కావాలి. ఈ మ్యాచ్‌లో రషీద్ ఖాన్ ఇంకా 12 వికెట్లు తీసే అవకాశం ఉంది. దీంతో ఒక మ్యాచ్‌లో 12 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా రషీద్ రికార్డు నెలకొల్పనున్నాడు.
- Advertisement -