Friday, October 18, 2024

బిగ్ మూవీలో భారీ తారాగణం

- Advertisement -
- Advertisement -

Rashmika act with Vijay

కోలీవుడ్ స్టార్ విజయ్ కధానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పీవీపీ బ్యానర్‌పై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా భారీ స్థాయిలో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్టార్ బ్యూటీ రష్మికా మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. విజయ్ 66వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో భారీ తారాగణం కనువిందు చేయనుంది. ఈ చిత్రంలో కీలక పాత్రలలో సీనియర్ స్టార్లు శరత్ కుమార్, ప్రభు, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, జయసుధ కనిపించనున్నారు.

వీరితో పాటు.. శ్యామ్, యోగిబాబు, సంగీత, సంయుక్త ఇతర కీలక పాత్రలలో సందడి చేయనున్నారు. అలాగే ఈ చిత్రాన్ని 2023 సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. సూపర్ ఫామ్‌లో ఉన్న సెన్సేషనల్ సంగీత దర్శకుడు తమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. వంశీ పైడిపల్లితో పాటు హరి, అహిషోర్ సాల్మన్ కథ, స్క్రీన్ ప్లేను, కార్తీక్ పళని ఛాయాగ్రాహకుడిగా, కెఎల్ ప్రవీణ్ ఎడిటర్‌గా ఈ చిత్రానికి పని చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News