Wednesday, January 8, 2025

రష్మికకు బంపర్ ఆఫర్

- Advertisement -
- Advertisement -

Rashmika acts In the NTR, Koratala Shiva combo movie

 

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘పుష్ప’తో హీరోయిన్ రష్మికకు కూడా పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు దక్కింది. ఇప్పటికే తెలుగు, తమిళం, కన్నడం, హిందీ సినిమాల్లో నటిస్తున్న రష్మికకు మరిన్ని ఆఫర్లు వస్తున్నాయి. గత కొన్ని నెలలుగా ఎన్టీఆర్, కొరటాల శివల కాంబో సినిమాలో హీరోయిన్ ఎవరు అనే విషయమై చర్చ జరుగుతోంది. అలియా భట్ మొదలుకుని పలువురు హీరోయిన్స్ పేర్లు పరిశీలిస్తున్నారనే వార్తలు వచ్చాయి. అయితే పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కించుకున్న రష్మిక నటిస్తే హిందీ, ఇతర భాషల రైట్స్‌కు మంచి డిమాండ్ ఉంటుందనే ఉద్దేశ్యంతో ఈ సినిమాలో హీరోయిన్‌గా ఆమెను ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి. రష్మిక మందన్నా ఇప్పటికే పలువురు స్టార్ హీరోయిన్స్ తో నటించి మెప్పించింది. ఎన్టీఆర్ తో ఆమె చేయబోయే సినిమా ఈ బ్యూటీ కెరీర్ కు మరింత కీలకంగా నిలవబోతుంది. పుష్ప సినిమా పార్ట్ 2లో నటించడంతో పాటు ఎన్టీఆర్, కొరటాల శివల కాంబోలో రూపొందబోతున్న సినిమాలో కూడా ఆమె నటిస్తే ఒకేసారి రెండు అతి పెద్ద సినిమాలు చేస్తున్న ఘనత రష్మికకు దక్కుతుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News