Monday, December 23, 2024

కాశ్మీరీ ముస్లిం అమ్మాయిగా…

- Advertisement -
- Advertisement -

Rashmika As Kashmiri Muslim girl

 

హృదయాన్ని హత్తుకునే రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లను రూపొందించడంలో పేరుగాంచిన దర్శకుడు హను రాఘవపూడి ప్రస్తుతం హీరో దుల్కర్ సల్మాన్‌ను అదే తరహా చిత్రంలో ‘లెఫ్టినెంట్ రామ్’గా చూపించబోతున్నాడు. మృణాళిని ఠాకూర్ అతనికి జోడీగా సీత పాత్రలో కనిపించనుంది. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీదత్, ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రష్మిక పుట్టినరోజు సందర్భంగా మంగళవారం ఆమెను ఈ ప్రాజెక్ట్‌లో భాగమని మేకర్స్ వెల్లడించారు. ఇందులో అఫ్రీన్ అనే కాశ్మీరీ ముస్లిం అమ్మాయిగా వీరోచిత పాత్రలో కనిపిస్తుంది. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రం రూపొందుతోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News