Sunday, December 22, 2024

రష్మిక డీప్‌ఫేక్ వీడియో: ఎపి వ్యక్తి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అయిన నటి రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియో వెనుక ఉన్న ప్రధాన నిందితుడిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుడిని ఎపిలో అరెస్ట్ చేశామని డిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు వెల్లడించారు. నిందితుడు గతేడాది నవంబర్ లో రష్మిక డీప్ ఫేక్ వీడియో సృష్టించాడు. వీడియోపై స్పందించిన రష్మిక ఆధునిక సాంకేతికత దుర్వినియోగంపై ఆవేదన వ్యక్తం చేశారు. బిటీష్- ఇండియన్ ఇన్ ప్ల్యూయెన్స్ అయిన జరా పటేల్ బాడీకి రష్మిక ముఖం పెట్టి డీప్ ఫేక్ వీడియో తయారు చేశాడు. దానిపై పలువురు సినీ ప్రముఖులు, కేంద్ర మంత్రులు సీరియస్ గా స్పందించారు. నిందితుడిపై ఫోర్జరీ చేసి వ్యక్తి ప్రతిష్టకు భంగం కలిగించినందుకు ఇండియన్ పీనల్ కోడ్, 1860లోని సెక్షన్ 465, 469 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News