Sunday, December 22, 2024

రూ. 10 లక్షల విరాళం ప్రకటించిన రష్మిక

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కేరళలో భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడి వాయనాడ్ జిల్లాలోని పలు గ్రామాలు నేలమట్టమయ్యాయి. దాదాపు 350 మంది దాకా మరణించారు. వందలాది మంది క్షతగాత్రులయ్యారు. సర్వం కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నవారిని సెలబ్రిటీలు తమకు తోచిన రీతిలో ఆదుకుంటున్నారు. ఈ క్రమంలో నటి రష్మిక మందన తన వంతు సాయంగా కేరళ సిఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 10 లక్షలు విరాళం ప్రకటించింది. పైగా ఈ కష్ట సమయంలో కేరళ ప్రజలు ధైర్యంగా ఉండాలని కోరుకుంది. కేరళలో ముండక్కీ, చూరల్ మల, మెప్పాడీ లో భారీ నష్టం సంభవించిన సంగతి తెలిసిందే. కర్నాటకలోని కొడగుకు చెందిన రష్మిక మందన్న కేరళ ప్రజలకు కష్ట సమయంలో సంఘీభావం ప్రకటించింది.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News