Monday, December 23, 2024

ఆ సినిమా కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తూ…

- Advertisement -
- Advertisement -

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న తన రెండవ తమిళ చిత్రం ‘వరిసు’ (వారసుడు)తో మంచి విజయాన్ని సాధించింది. కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటించిన ఈ చిత్రం ఈ పొంగల్ సీజన్‌లో తమిళనాడుతో పాటు విదేశాల్లోనూ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ నేపథ్యంలో రష్మిక మందన్న ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్ డ్రామా ‘పుష్ప 2’ గురించి అప్‌డేట్ ఇచ్చింది.

ఫిబ్రవరి నుండి షూటింగ్ ప్రారంభిస్తారని, షూట్‌లో చేరడానికి ఉత్సాహంగా ఎదురు చూస్తున్నానని వెల్లడించింది. ‘పుష్ప’లో రష్మిక… శ్రీవల్లి అనే పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించింది. హీరో అల్లు అర్జున్‌తో ఆమె కెమిస్ట్రీ సినిమా హైలైట్‌లలో ఒకటి. రష్మిక నటించిన రెండవ బాలీవుడ్ చిత్రం మిషన్ మజ్ను జనవరి 20న డైరెక్ట్ గా నెట్‌ఫ్లిక్స్ లో విడుదల కానుంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న రణబీర్ కపూర్ నటిస్తున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘యానిమల్’లో రష్మిక ప్రధాన పాత్రలో కనిపించనుంది. ఆగస్ట్‌లో ఈ సినిమా విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News