Sunday, December 22, 2024

బాలీవుడ్‌లో ఐటం సాంగ్

- Advertisement -
- Advertisement -

Rashmika in talks for Special Song in Animal Movie

కొందరు కథానాయికలకు పట్టిందల్లా బంగారమే. కాస్త నేము, ఫేము ఉంటే చాలు వారికి డిమాండే డిమాండ్లు. ఇప్పుడు సౌత్‌లో స్టార్ హీరోయిన్లు ఆడిందే ఆట, పాడిందే పాట. స్టార్ హీరోయిన్లు ఐటం సాంగుల్లో నటించే అవకాశం వస్తే, ఏమాత్రం వదలడం లేదు. ఈ మధ్య సమంత పుష్పలో ఐటం సాంగ్ చేసింది. గనిలో తమన్నా ఐటం సాంగ్‌లో నర్తించింది. ఇప్పుడు రష్మికకు ఇలాంటి అవకాశమే వచ్చింది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్‌లో ‘యానిమల్’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఓ ఐట సాంగ్ ఉంది. ఈ సాంగ్‌ను సౌత్ ఇండియన్ హీరోయిన్‌తో చేయించాలన్నది సందీప్ రెడ్డి ఆలోచన. అందుకే రష్మికని సంప్రదించారని తెలిసింది. ఈ సాంగ్‌లో స్టెప్పులు వేయడానికి రష్మిక ఓకే చెప్పిందని సమాచారం. ఆ ఐటం సాంగ్ కోసం రష్మికకు భారీ రెమ్యునరేషన్ ఇవ్వనున్నారట.

Rashmika in talks for Special Song in Animal Movie

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News