Monday, January 20, 2025

నేను హీరోని: రష్మిక

- Advertisement -
- Advertisement -

గీతాగోవిందం సినిమాలో తన నటనకు రష్మిక మందనా మంచి పేరు తెచ్చుకుంది. పుష్ప, యానిమిల్ చిత్రాలతో ఆమె బాలీవుడ్ స్థాయిలో మెరిసింది. ఆమె ఇప్పటి వరకు హీరో పక్కన హీరోయిన్‌గా మాత్రమే నటించి మెప్పించింది. ప్రస్తుతం ఆమె లేడీ ఓరియెంటెడ్ సినిమాకు ఓకే చెప్పింది. ‘ది గార్ల్ ఫ్రెండ్’ సినిమాలో ఆమె నటిస్తోంది. రష్మికకు తోడు దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి నటిస్తున్నారు. పలువురు పాపులర్ యాక్టర్లతో ఆమె నటిస్తుంది. ఈ చిత్రానికి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు.

సినిమా ప్రమోషన్ సంబంధించిన విషయాలు రాహుల్ దగ్గర ఉండి ఆప్‌డేట్ ఇస్తున్నాడు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడారు. ఏప్రిల్ 5న రష్మిక మందనా పుట్టిన రోజు ఉండడంతో ఈ సినిమాకు సంబంధించి టీజర్‌ను విడుదల చేస్తామన్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే అన్ని భాషల్లో రష్మిక సొంతంగా డబ్బింగ్ చెబుతోందని వివరించారు. ఆమె డెడికేషన్‌కు షాక్ గురయ్యానని రాహుల్ ప్రశంసించారు. ఇన్నాళ్లు తనని హీరోలకు జోడీగా చూశారని, ఇప్పుడు తానే మరొకరికి జోడీగా ఉన్నానని రష్మిక నవ్వుతూ చెప్పింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News