హైదరాబాద్: ‘ఫ్యామిలీ స్టార్’ అనే సినిమాలో విజయ్ దేవరకొండ, మృణాల ఠాకూర్ జంటగా నటిస్తున్నారు. సినిమా యూనిట్ గురువారం ట్రైలర్ విడుదల చేయడంతో రష్మిక వీక్షించి ట్వీట్టర్లో విజయ్‌కు ట్వీట్ చేశారు. తనకెంతో ఇష్టమైన విజయ దేవరకొండ, పరశురామ్ ఫ్యామిలీ స్టార్‌తో విజయాన్ని అందుకోవాలని ఆమె కోరుకున్నారు. ఏప్రిల్ 5వ తేదీ కోసం ఎదురుచూస్తున్నానని, సిని పెద్ద హిట్ అవుతుందని, దావత్ కావాలని ఆమె అడిగారు. దీనిపై విజయ్ స్పందించారు. క్యూటెస్ట్ రిప్లై అని సమాధానమిచ్చారు.
ఈ సినిమాలో విజయ్ మధ్య తరగతి వ్యక్తిగా కనిపిస్తాడు. ప్యామిలీ స్టార్ సినిమా ట్రైలర్‌ను తిరుపతిలో విడుదల చేశారు. శ్రీవారి దర్శనం కోసం తిరుపతికి చాలా సార్లు వచ్చానని, తిరుపతి నుంచి సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టడం సంతోషంగా ఉందని చెప్పిన విజయ్ తెలిపాడు. సినీ ప్రేక్షకులు వేసవి సెలవుల్లో తప్పకుండా ఎంజాయ్ చేస్తారని, విడుదలైన తరువాత మిమల్ని కలుస్తానని విజయ్ ప్రసంగించిన విషయం తెలిసిందే. గీతా గోవిందం సినిమా దర్శకుడు పరశురామ్ ఈ సినిమాకు కూడా డైరెక్టరుగా పని చేస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. లైగర్ పరాజయం తరువాత హిట్ కోసం విజయ్ దేవరకొండ ఎదురు చూస్తున్నాడు. ఖుషి సినిమాకు మిశ్రమ స్పందన వచ్చిన విషయం తెలిసిందే.