Monday, December 23, 2024

కాశ్మీరీ ముస్లిం అమ్మాయిగా రష్మిక

- Advertisement -
- Advertisement -

Rashmika mandana is Kashmir girl

‘సీతా రామం’ చిత్రంలో రష్మిక మందన్న పాత్రని హిజాబ్ ధరించిన లుక్‌తో ఆమె పుట్టినరోజు కానుకగా గతంలో పరిచయం చేశారు. శ్రీరామ నవమి రోజున విడుదల చేసిన గింప్స్‌లో యుద్ధంలో రామ్, సీత విజయం సాధించేలా అఫ్రీన్‌గా రష్మిక కోరుకునేలా ఆసక్తికరంగా చూపించారు. ఆదివారం ఈద్ ఉల్-అధా పర్వదినం సందర్భంగా.. రష్మిక పాత్రకు సంబధించిన ప్రత్యేక పోస్టర్ విడుదల చేశారు. హిజాబ్ ధరించిన రష్మిక మందన్న ఈద్ ఉల్-అధా శుభాకాంక్షలను తెలియజేస్తున్న ఈ పోస్టర్ ఈద్ పర్వదినానికి ప్రత్యేకంగా నిలిచింది. ఈ చిత్రంలో రష్మిక చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. కాశ్మీరీ ముస్లిం అమ్మాయి అఫ్రీన్‌గా కనిపించనుంది. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ రామ్, సీతగా ఈ చిత్రంలో కనిపించనున్నారు. బ్రిగేడియర్ విష్ణు శర్మగా సుమంత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. వైజయంతీ మూవీస్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తోంది. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఆగస్ట్ 5న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News