Friday, November 15, 2024

అటువంటి అబ్బాయిలే నచ్చుతారు

- Advertisement -
- Advertisement -

Rashmika mandana like good person

తక్కువ వ్యవధిలో ఎక్కువ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్లలో రష్మిక ఒకరు. ఆమె తెలుగుకు మాత్రమే పరిమితం కాకుండా తమిళం, హిందీ సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. రష్మిక.. తాజాగా తెలుగులో పుష్ప, ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రాల్లో నటిస్తోంది. తన అందచందాలతో యూత్‌ను మైమరపిస్తున్న ఆమె తాజాగా సోషల్ మీడియాలో కాసేపు ముచ్చటించింది. ఈ సందర్భంగా తనకు నచ్చే అబ్బాయిలు ఎలా ఉండాలనే దాని మీద ఆమె ఓపెన్ అయ్యింది. మంచి వ్యక్తిత్వంతో పాటు.. డబ్బుల విషయంలోనూ పొదుపుగా ఉండే అబ్బాయిలు తనకు బాగా నచ్చుతారని చెప్పింది. నిజానికి గ్లామర్ ఫీల్డ్‌లో సక్సెస్‌ఫుల్‌గా ఉండే ఏ హీరోయిన్ చెప్పని మాటగా దీన్ని చెప్పాలి. అదే సమయంలో.. తన చుట్టుపక్కల ఎవరైనా సిగిరెట్ కాలిస్తే అసౌకర్యంగా ఉంటుందని పేర్కొంది. అభిమానులు అడిగిన మరో ప్రశ్నకు ఆసక్తికర సమాధానాన్ని ఇచ్చింది. దేవుడు ప్రత్యక్షమై.. ఒకే ఒక్క కోరికను తీర్చే వరమిస్తే.. ఏం చేస్తారని ప్రశ్నిస్తే.. లోకంలోని బాధనంతా మటుమాయంచేసి అందరి ముఖాల్లో సంతోషంతో వెలిగిపోయేలా చేయమని కోరతానని చెప్పి.. అందరి మనసుల్నిదోచేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News