Sunday, December 22, 2024

ఘనంగా ఐపిఎల్ ఆరంభ వేడుకలు.. అదరగొట్టిన రష్మిక, తమన్నా (వీడియో)

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: ఐపిఎల్ టి20 టోర్నమెంట్ 16వ సీజన్ ఆరంభ వేడుకలు ఘనంగా జరిగాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఆరంభోత్సవ వేడుకలు అభిమానులను కనువిందు చేశాయి. బాలీవుడ్ స్టార్‌లు రష్మిక మందాన, తమన్నా భాటియాలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని నాటు నాటు, పుష్ప సినిమాలోని శ్రీవల్లి, సామీ సామీ తదితర పాటలకు రష్మిక చేసిన డాన్స్‌తో స్టేడియం హోరెత్తింది.

మరోవైపు ఊ .. అంటావా మావా.. ఊ ఊ అంటావాతో పాటు టమ్ టమ్ పాటకు తమన్నా చేసిన డాన్స్ అభిమానులను ఉర్రుతాలుగించింది. అంతేగాక ప్రముఖ గాయకుడు అర్జిత్ సింగ్ కూడా తన పాటలతో అలరించాడు. భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జైషాతో పాటు హార్దిక్ పాండ్య, మహేంద్ర సింగ్ ధోనీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదిలావుండగా ఆరంభోత్సవ కార్యక్రమానికి ఫైర్ వర్క్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News