హైదరాబాద్: మెటా(గతంలో ఫేస్‌బుక్) నేడు హైదరాబాద్‌తో పాటుగా దేశవ్యాప్తంగా క్రియేటర్ల పట్ల తమ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ హైదరాబాద్‌లో మొట్టమొదటిసారిగా క్రియేటర్స్ డే నిర్వహించింది. ఈ కార్యక్రమంలో క్రియేటర్ల కోసం వినూత్నమైన కార్యక్రమాన్ని సైతం విడుదల చేశారు. అక్కడ వారు మెటాతో కలిసి పనిచేయడంతో పాటుగా తమ సొంత అగుమెంటెడ్ రియాల్టీ (ఏఆర్) ఎఫెక్ట్స్‌ను పొందవచ్చు. తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలపై అనుసంధానిత మరియు వృద్ధికి ఇది తోడ్పడుతుంది. మెటా యొక్క వార్షిక ప్రతిష్టాత్మక కార్యక్రమం క్రియేటర్స్ డే. దీనిద్వారా క్రియేటర్లను వేడుక చేయడంతో పాటుగా ఒకరి నుంచి మరొకరు నేర్చుకునేందుకు, సహకరించుకునేందుకు మరియు సృష్టించేందుకు తగిన అవకాశాలను సైతం అందిస్తుంది. 2022 సంవత్సరపు క్రియేటర్స్ డే కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఐదు నగరాలలో జరుగనున్నాయి. ఈ కార్యక్రమం మొట్టమొదటి సారిగా ముంబైలో జరిగింది. ఇప్పుడు ఇది హైదరాబాద్‌లో జరుగుతుంది. ఇది ఇక్కడ జరగడం మొట్టమొదటిసారి. ఈ క్రియేటర్స్ డే వద్ద తమ అభిమాన క్రియేటర్లను కలుసుకోవడంతో పాటుగా సంభాషించే వినూత్న అవకాశాన్ని అభిమానులకు మెటా అందించింది. దీని ద్వారా వారితో బంధాన్ని మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ కార్యక్రమంలో క్రియేటర్ల కోసం నూతన ప్రోగ్రామ్‌ను భారతదేశ వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు మెటా వెల్లడించింది. గత సంవత్సరం విజయవంతంగా పరీక్షించిన తరువాత, ఎంపిక చేయబడిన క్రియేటర్లు ఇప్పుడు మెటా స్పార్క్ క్రియేటర్లతో కలిసి పనిచేస్తారు. ఈ మెటా స్పార్క్ క్రియేటర్లు, మెటా స్కార్క్ ప్లాట్‌ఫామ్ వినియోగించుకుని తమ ఏఆర్ ఎఫెక్ట్స్‌ను ప్రచురించడం, నిర్వహించడం మరియు ట్రాక్ చేయడం చేస్తారు. ఈ కారణం చేత అత్యంత వినోదాత్మకమైన, ఆసక్తికరమైన ఏఆర్ ఎఫెక్ట్స్ సాధ్యం కావడంతో పాటుగా ఈ ఎంపిక చేయబడ్డ క్రియేటర్ల ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలపై లభ్యమవుతాయి. తద్వారా వారు కంటెంట్ సృష్టించే సమయంలో వీటిని వినియోగించడం, తమ కమ్యూనిటీతో అనుసంధానించబడటం చేయవచ్చు. ఎంపిక చేయబడ్డ క్రియేటర్లు భారతదేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకూ చెంది ఉంటారు. వీరిలో కొందరు హైదరాబాద్ నుంచి కూడా ఉన్నారు. గత కొద్ది రోజులలో 15 ఎఫెక్ట్స్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. మరికొన్ని డిసెంబర్ చివరి నాటికి అందుబాటులో ఉండనున్నాయి.
మనీష్ చోప్రా, డైరెక్టర్ అండ్ హెడ్ ఆఫ్ పార్టనర్‌షిప్స్ – ఫేస్‌బుక్ ఇండియా (మెటా ) మాట్లాడుతూ ‘‘క్రియేటర్లకు మేము అతి పెద్ద అభిమానులం. ఎందుకంటే వీరే సంస్కృతికి ఓ ఆకృతి అందిస్తున్నారు. మేము ఈ క్రియేటర్లను దృష్టిలో ఉంచుకుని అత్యధిక శాతం మా ఉత్పత్తులను రూపొందిస్తుంటాము. అందుకు రీల్ అత్యుత్తమ ఉదాహరణ. మీరు క్రియేటర్ కావొచ్చు లేదా ఇన్ఫ్లూయెన్సర్ కావొచ్చు. కానీ రీల్స్ పై, అంతర్జాతీయ ఐకాన్‌గా మారడంలో మీ ప్రయాణం ప్రారంభమైందని మేము నమ్ముతున్నాము’’ అని అన్నారు. ఆయనే మాట్లాడుతూ.. ‘‘ నూతన ఏఆర్ ప్రోగ్రామ్ విడుదల చేయడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. దీని ద్వారా క్రియేటర్లు మరింతగా లీనమయ్యే అనుభవాలను సృష్టించడంలో సహాయపడటంతో పాటుగా తమ అభిమానులతో మరింత లోతైన అనుబంధం ఏర్పరుచుకోవడంలో సహాయపడనున్నాం’’ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటి రష్మిక మందన్న తన ప్రదర్శనతో ప్రేక్షకులకు ఆనందాశ్చర్యాలను కలిగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘‘తెలంగాణా మరియు ఆంధ్రప్రదేశ్‌లలో అత్యున్నత క్రియేటర్లును ఓ దరికి చేర్చి ఈ కార్యక్రమం ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. క్రియేటర్లకు నేను చెప్పేదేమిటంటే, మీ సమయం ఇప్పుడు ప్రారంభమైంది. రీల్స్‌తో, మీరు సంస్కృతులను నిర్వచిస్తున్నారు. మేము చేసిన సినిమాలు, వాటిలోని పాత్రల ద్వారా మీరు స్ఫూర్తి పొంది ఉండవచ్చేమో కానీ మీ ద్వారా నేను కూడా స్ఫూర్తిని పొందాను’’ అని అన్నారు.
ఈ కార్యక్రమాన్ని క్రియేటర్లు వారి సహచరుల నుంచి మరింతగా తెలుసుకోగలరనే సిద్ధాంతంతో నిర్వహించారు. అందువల్ల క్రియేటర్ ఆధారితరంగా చర్చ కూడా జరిగింది. హైదరాబాద్‌లోని ఈవెంట్ కోసం క్రియేటర్లు నిహారిక ఎన్‌ఎం (@niharika_nm); షణ్ముఖ్ జస్వంత్ కంద్రేగుల (@shannu_7); అలేఖ్య హారిక (@alekhyaharika_); గీతా మాధురి (@singergeethamadhuri); ప్రణవి మానుకొండ (@pranavi_manukonda), మున్నాభాయ్ గేమింగ్ (@munnabhai_gaming)లు అంబాసిడర్లుగా వ్యవహరించారు నగరంలో విభిన్న ప్రాంతాలలోని ఔట్‌డోర్ ప్రకటనలలో వీరు కనిపించారు. క్రియేటర్స్ డే కార్యక్రమాలు జరిగే ఇతర నగరాలలో కోల్‌కతా, చెన్నై, ఢిల్లీ ఉండనున్నాయి. ఈ కార్యక్రమాలకు సంబంధించిన అప్‌డేట్స్ కోసం #MetaCreatorDay అనుసరించండి.
Rashmika Mandanna at Meta Creator Day in Hyderabad