Sunday, December 22, 2024

రష్మిక పుట్టిన రోజు…. సోషల్ మీడియాలో వైరల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కన్నడ బామ రష్మిక మందన్నా పుట్టిన రోజు సందర్భంగా ఆమె పేరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పుష్ప సినిమాలో పాన్ ఇండియా హీరోయిన్‌గా మారిపోయింది. యానిమల్ మూవీతో నేషనల్ వైడ్ స్టార్‌గా ఎదిగారు. హ్యాపీ బర్త్ డే రష్మిక అనే యాష్ ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండ్‌లోకి వచ్చింది. ఆమెకు పలువురు సెలబ్రిటీల నుంచి జన్మిదిన శుభాకాంక్షలు వెల్లువెత్తడంతో ఆమె పేరు సామాజిక మాధ్యమాల్లో మారు మ్రోగుతోంది. ఆమె నటిస్తున్న సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ ఇవ్వడంతో పాటు ఫస్ట్ లుక్‌లు విడుదల చేస్తున్నారు. పుష్ప 2 ది రూల్ సినిమా నుంచి శ్రీ వల్లి లుక్‌ను విడుదల చేశారు. ది గీతా ఆర్ట్ నిర్మాణంలో తెరకెక్కుతున్న గర్ల్ ఫ్రెండ్, నాగార్జున, ధనుష్‌లతో నటిస్తున్న కుబేరా చిత్రాల నుంచి పోస్టర్లను విడదలు చేశారు. సోషల్ మీడియాలో ఆమె పేరు తొలి స్థానంలో ట్రెండింగ్ అవుతోంది. టాలీవుడ్ లో గీతాగోవిందం సినిమాలో రష్మిక నటించి ప్రేక్షకుల మనసు దోచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News